Amaravati: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఈ నెలలోనే పనులు పునః ప్రారంభించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీతో శంకుస్థాపన చేయనుంది. కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఇంతకాలం నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది ప్రభుత్వం. భారీగా నిధులు సమీకరించగలిగింది. అయితే ఈ నిధుల సమీకరణకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడుగున అడ్డు తగిలినట్లు విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు తెగ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయినా సరే అదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయిన తరువాత ప్రపంచ బ్యాంకు తొలి విడతగా అమరావతికి రూ.4285 కోట్లను విడుదల చేసింది. అయితే ఆ నిధులను ఎలాగైనా అడ్డుకోవాలని భావించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఆ పని చేయలేక పోయింది.
Also Read: సజ్జలపై నమ్మకం.. జగన్ పై సీనియర్ల తిరుగుబాటు!
* ఫుల్ ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధానిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి అమరావతి నిర్మాణ పనులను యధాస్థితికి తీసుకొచ్చింది. నిపుణులతో ఆ నిర్మాణాలపై అధ్యయనం చేసింది. ఆ నిర్మాణాలు పనికొస్తాయని నిర్ధారించిన పనుల పునః ప్రారంభానికి నిర్ణయించింది. అయితే ఈ 10 నెలల పాటు నిధుల సమీకరణ పై దృష్టి పెట్టింది. ఎన్డీఏ లో టిడిపి కీలక భాగస్వామి కావడంతో కేంద్ర ప్రభుత్వం సైతం అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు ముందుకు వచ్చింది. వార్షిక బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రపంచ బ్యాంకు తో పాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి ఈ నిధుల సర్దుబాటు చేసింది.
* ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు మెయిల్స్..
అయితే ఇక్కడే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ రంగంలోకి దిగింది. గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచం నలుమూలల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అమరావతి భూములను బలవంతంగా లాక్కున్నారని.. అక్కడ రైతులు, రైతు కూలీల జీవనోపాధి పోయిందని.. వారి జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయని.. అమరావతికి కృష్ణానది వరద ప్రమాదం పొంచి ఉందని.. ఇలా చాలా రకాల ఫిర్యాదులు చేశారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. రెండుసార్లు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిని సందర్శించారు. వారు విజయవాడలో బసచేసిన హోటల్కు కొంతమంది వైసీపీ నేతలు వెళ్లినట్లు కూడా ప్రచారంలో ఉంది. వారి నుంచి అభిప్రాయాలను సేకరించిన ప్రపంచ బ్యాంకు బృందం.. నిజ నిర్ధారణకు వచ్చి అమరావతి రాజధాని నిర్మాణానికి సాయం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. తొలివిడతగా రూ.4285 కోట్లు అందించింది.
* అప్పట్లో కూడా అలానే..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం( Telugu Desam ) ప్రభుత్వం. అందరి ఆమోదంతో అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. దాదాపు 33 వేల ఎకరాల భూమిని సమీకరించగలిగింది. రైతుల స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములను అందించారు. అయితే అమరావతి పై విషం చిమ్మాలన్న ఉద్దేశంతో అప్పట్లో కూడా ప్రపంచ బ్యాంకుకు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినట్లు ప్రచారంలో ఉంది. 2017 లో దాదాపు 4 వేల కోట్ల రూపాయల వరకు మంజూరు చేసేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధపడింది. అప్పట్లో ఇదే మాదిరిగా అమరావతి రాజధానిపై విషం చిమ్ముతూ అనేక రకాల ఫిర్యాదు లు చేశారు. అప్పట్లో ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా పోయాయి. ఇప్పుడు కూడా వారు అదే ప్రయత్నాలు చేసినా.. ఫలితం మాత్రం దక్కలేదు.
Also Read: జగన్ కు ముద్రగడ లేఖ.. జీర్ణించుకోలేకపోతున్న కాపు సామాజిక వర్గం!