Jagan And KCR: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) రాజకీయ స్నేహితులు ఉన్నారు. బద్ధ విరోధులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు బద్ద విరోధిగా ఉన్నారు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్. కానీ అదే సమయంలో చంద్రబాబు ప్రత్యర్థి జగన్ తో స్నేహం కొనసాగిస్తున్నారు కెసిఆర్. మరోవైపు కేసీఆర్ ను అధికారం నుంచి దూరం చేసిన రేవంత్ రెడ్డి తో చంద్రబాబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. సో ఇలా తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రాజకీయ స్నేహాలు నడుస్తున్నాయి. అయితే మొన్నటి వరకు చంద్రబాబుతో పాటు రేవంత్ ప్రతిపక్షంలో ఉండగా.. ఇప్పుడు అదే ప్రతిపక్షంలోకి వెళ్లారు కేసీఆర్, జగన్. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రకమైన రాజకీయ భావసారుభ్యత నడుస్తోంది.
Also Read: అమరావతి పై ప్రపంచవ్యాప్తంగా ఫిర్యాదులు.. ఆ నిధులకు అడ్డంకి
* రాజకీయ వైరం..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణకు కెసిఆర్( kalvakuntla Chandrasekhar Rao ) సీఎం అయ్యారు. ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరి మధ్య రాజకీయ వైరం పతాక స్థాయికి చేరింది. ఈ తరుణంలోనే కెసిఆర్ జగన్ మోహన్ రెడ్డి తో స్నేహం చేశారు. రాజకీయంగా వారిద్దరూ పరస్పర సహకారం అందించుకున్నారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కు జగన్ సాయం చేశారు. అటు తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఏపీలో సహకారం అందించారు కేసీఆర్. కెసిఆర్ రెండోసారి అధికారంలోకి రాగా.. జగన్మోహన్ రెడ్డి తొలిసారి విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి వారి ప్రయాణం స్నేహపూర్వకంగా కొనసాగుతూ వచ్చింది.
* ఏడాది వ్యవధిలో ఇద్దరికీ ఓటమి
2023 తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయారు కేసీఆర్. అక్కడకు ఒక సంవత్సరం తర్వాత ఏపీలో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) దారుణ పరాజయం చవి చూశారు. ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ఇద్దరు నాయకులు. తెలంగాణలో ఓడిపోయిన ఏడాది తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టారు కెసిఆర్. ఏపీలో అయితే కేవలం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకే సభకు హాజరయ్యారు జగన్. ఈ విషయంలో ఈ ఇద్దరు పరిస్థితి ఒకేలా ఉంది. ఒకరికొకరు ఆలోచించుకొని రాజకీయంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అటు జాతీయస్థాయిలో సైతం ఇద్దరు నేతల అడుగులు ఒకే మాదిరిగా ఉన్నాయి. మొన్నటి వరకు బిజెపిని వ్యతిరేకించిన కేసీఆర్ మెత్తబడ్డారు. జగన్ సైతం కేంద్ర పెద్దలతో సయోధ్యకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా తనది కూడా కేసీఆర్ బాట అని చెబుతున్నారు.
* అటు ఇటుగా ఒకేసారి..
మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో( Telangana politics) యాక్టివ్ కావాలని చూస్తున్నారు చంద్రశేఖర రావు అలియాస్ కేసీఆర్. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని వజ్రోత్సవ వేడుకలుగా నిర్వహించాలని భావిస్తున్నారు. తద్వారా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఏపీలో జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధపడుతున్నారు. 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో పర్యటనలకు అన్ని విధాలా సిద్ధపడుతున్నారు. వారంలో మూడు రోజుల పాటు ప్రజల మధ్య ఉండేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇలా ఎలా చూసుకున్నా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ల మధ్య రాజకీయ భా వ సారూప్యత స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: జగన్ కు ముద్రగడ లేఖ.. జీర్ణించుకోలేకపోతున్న కాపు సామాజిక వర్గం!