https://oktelugu.com/

AP Liquor Policy 2024: ఏపీలో మద్యం పాలసీ.. 11న లాటరీ.. 12న షాపులు ప్రారంభం!

మందు బాబులకు గుడ్ న్యూస్. మరో పది రోజుల్లో తక్కువ ధరకు బ్రాండెడ్ మద్యం లభించనుంది. ఈ మేరకు కొత్త మద్యం పాలసీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు నుంచి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం అయ్యింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 1, 2024 / 09:40 AM IST

    AP Liquor Policy 2024

    Follow us on

    AP Liquor Policy 2024: ఏపీలో నూతన మద్యం విధానం ఖరారు అయ్యింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమలులో ఉంటుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3396 ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఈ దుకాణాలకు సంబంధించి లైసెన్సుల జారీకి సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈనెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 11న లాటరీ తీయనన్నారు.12 నుంచి కొత్త దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా పెట్టుకోవచ్చు. ఒక్కో దుకాణానికి సంబంధించి రెండు లక్షలు చొప్పున నాన్ రిఫెండబుల్ రుసుము చెల్లించాలి. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ తీసి లైసెన్సులు కేటాయిస్తారు. ఈనెల 11న ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. కాగా గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ మద్యం దుకాణాల గొడుగు సోమవారంతో ముగిసిపోయింది. అయితే కొత్త దుకాణాలు అందుబాటులోకి వచ్చేవరకు.. ప్రభుత్వ మద్యం దుకాణాలు కొనసాగున్నాయి.

    * ఎన్నికల్లో హామీ మేరకు
    తాము అధికారంలోకి వస్తే ప్రైవేటు మద్యం దుకాణాలు అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాత బ్రాండ్లను తక్కువ ధరకు అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైసిపి ప్రభుత్వం మద్యం పాలసీ ముగియడంతో.. కొత్త మద్యం పాలసీని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో మద్యం పాలసీలను పరిశీలించింది ఈ కమిటీ. కనిష్ట మద్యం ధర క్వార్టర్ 99 రూపాయలుగా నిర్ణయించింది. గతంలో ఉండే ప్రీమియం బ్రాండ్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు డిసైడ్ అయ్యింది. వైసిపి హయాంలో మంజూరైన బ్రాండ్లన్నీ ఇక కనిపించవు. మరో పది రోజుల్లో ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రానుండడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    * జనాభా ప్రాతిపదికగా
    మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి జనాభాను ప్రాతిపదికగా తీసుకున్నారు. నాలుగు స్లాబ్ ల్లో లైసెన్స్ రుసుము ఖరారు చేశారు. తొలి ఏడాది పదివేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షలు, ఐదు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలు గా లైసెన్సురుసును నిర్ణయించారు. రెండు ఏడాది ఈ రుసుములపై 10 శాతం చొప్పున పెంచి వసూలు చేస్తారు. యాట ఆరు విడతల్లో లైసెన్సు రుసుము చెల్లించాలి. రిటైల్ వ్యాపారం చేసి లైసెన్స్ దారులకు 20 శాతం మేర మార్జిన్ ఉంటుంది. కార్పొరేషన్లు మినహా మిగతా చోట్ల మద్యం దుకాణాలను మోడల్ స్టోర్స్ కు అప్డేట్ చేసేందుకు నూతన విధానంలో అవకాశం కల్పించారు. ఎందుకుగాను ఏడాదికి ఐదు లక్షల రూపాయలు అదనంగా లైసెన్సు రుసుము చెల్లించాలి.

    * 12 ప్రీమియం స్టోర్లకు సైతం
    రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లో 12 ప్రీమియం స్టోర్ ల ఏర్పాటుకు సైతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురంలో ప్రీమియం స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ స్టోర్ లకు ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. లైసెన్సు రుసుము ఏడాదికి కోటి రూపాయలు. వీటికి సంబంధించిన విధివిధానాలు విడిగా ఖరారు చేస్తారు.