AP Liquor Policy 2024: తిరుపతిలో మద్యం షాపులు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈనెల తొమ్మిది వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలు ఏర్పాటుకు నిర్ణయించింది. అయితే తిరుపతిలో మద్యం దుకాణాల ఏర్పాటుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Written By: Dharma, Updated On : October 1, 2024 9:42 am

AP Liquor Policy 2024(1)

Follow us on

AP Liquor Policy 2024: నూతన మద్యం షాపుల ఏర్పాటు విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ప్రస్తుతం తిరుమల లడ్డు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే తిరుపతిలో మద్యం షాపుల ఏర్పాటు విషయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు పడినట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3, 396 మద్యం దుకాణాలకు లైసెన్స్ జారీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.అయితే అత్యధికంగా తిరుపతి జిల్లాకు మద్యం దుకాణాలు కేటాయించినట్లు ప్రచారం సాగింది. తిరుమల పై ఇదేనా శ్రద్ధ అంటూ సోషల్ మీడియాలో సైతం ప్రచారం సాగింది. దీంతో కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాల ఏర్పాటు విషయంలో తిరుమలలో కొన్ని ప్రాంతాలకు మినహాయించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేదు.బస్టాండ్, లీలమహాల్ సర్కిల్,నంది సర్కిల్,విష్ణు నివాసం, శ్రీనివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు వీలు లేదు. ప్రభుత్వం అక్కడ మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుమతించలేదు. ప్రస్తుతం తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో… తిరుమలలో భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలు కేటాయిస్తే విమర్శలు చెలరేగే అవకాశం ఉంది. అందుకే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

* భక్తుల రద్దీ ఉన్న ప్రాంతంలో
తిరుమలకు కోట్లాదిమంది భక్తులు వస్తుంటారు.ఈ తరుణంలో తిరుపతిలో మద్యం విషయంలో గతం నుంచి ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నాయి.భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాల్లో మద్యం షాపులకు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది.తిరుపతిలో షాపుల సంఖ్య తగ్గించింది.మిగతా జిల్లాలో మాత్రం వాటిని ఏర్పాటు చేసింది.

* సోషల్ మీడియాలో ప్రచారం
గత కొద్ది రోజులుగా తిరుపతి లడ్డు వివాదం నడుస్తోంది.ఈ చిన్నపాటి లోపం వెలుగు చూసినా.. ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సైతం నడుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా తిరుపతిలో మద్యం దుకాణాలు ఏర్పాటు విషయంలో సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. పెద్ద ఎత్తున మద్యం దుకాణాలు కేటాయిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం కూడా చేశారు. అయితే తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో అదంతా తప్పుడు ప్రచారం అని తేలిపోయింది.