Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: అప్పుడు బూతులు.. ఇప్పుడు భక్తి.. కొడాలి నాని లో ఏం మార్పు!

Kodali Nani: అప్పుడు బూతులు.. ఇప్పుడు భక్తి.. కొడాలి నాని లో ఏం మార్పు!

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ సౌండ్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన వైసీపీ కార్యక్రమాల్లో ఇప్పుడు పాల్గొంటున్నారు. తాజాగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కోఆర్డినేటర్ల సమావేశానికి సైతం హాజరయ్యారు. అయితే ఇలా వచ్చిన క్రమంలో ఆయన సైలెంట్ గా ఉండలేదు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు […]

Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ సౌండ్ చేయడం ప్రారంభించారు. గత కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆయన వైసీపీ కార్యక్రమాల్లో ఇప్పుడు పాల్గొంటున్నారు. తాజాగా వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్న మధ్యన జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన కోఆర్డినేటర్ల సమావేశానికి సైతం హాజరయ్యారు. అయితే ఇలా వచ్చిన క్రమంలో ఆయన సైలెంట్ గా ఉండలేదు. కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడ్డారు. వైసిపి పై గొడ్డలి పార్టీ ప్రచారంపై మండిపడ్డారు. అది పరశురాముడి గొడ్డలి అని.. శివుడు చేతిలో ఉన్న గొడ్డలి అని ఆధ్యాత్మిక ప్రబోధం చేశారు. ఆధ్యాత్మిక కామెంట్స్ చేశారు. అందులో కూడా తనదైన దూకుడు తనం చూపించారు. అయితే కొడాలి నాని అన్నింటికి తెగించినట్టు కనిపిస్తున్నారు.

* ఓటమితో ఫుల్ సైలెన్స్..
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు బూతులతో రెచ్చిపోయేవారు కొడాలి నాని. కానీ అధికారానికి దూరమయ్యేసరికి ఆయన ఫుల్ సైలెన్స్ పాటించాల్సి వచ్చింది. ఆయన అరెస్ట్ తప్పకుండా జరుగుతుందన్న ప్రచారం మొదలైంది అప్పట్లో. అందుకు తగ్గట్టుగానే ఆయనపై వ్యతిరేక ఫిర్యాదులు బాగానే వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే ఇంతలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటు రావడంతో ముంబైలోని ఓ పేరు మోసిన ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన చాలా రోజులపాటు హైదరాబాదులో విశ్రాంతి తీసుకున్నారు. ప్రభుత్వం కూడా ఆయన విషయంలో పెద్దగా పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. అయితే ఇప్పుడు కోలుకోవడంతో బయటకు వచ్చి తిరిగి విమర్శలు చేస్తున్నారు.

* మారిన వైఖరి..
కానీ గతం కంటే కొడాలి నాని వైఖరి మారింది. గతంలో బూతులతో రెచ్చిపోయే కొడాలి నాని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చారో తెలియదు కానీ.. ఆయన పుణ్యమా అని పార్టీపై బూతుల ప్రభావం కనిపించింది. తటస్తులు సైతం ఆయన వైఖరిని తప్పుపట్టారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన నోటి నుంచి ఆధ్యాత్మిక పలుకులు వస్తున్నాయి. ఇటీవల గొడ్డలి పార్టీ అంటూ కూటమి పార్టీ నేతలు వైసిపి పై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించారు కొడాలి నాని. దేవుళ్ళ చేతిలో ఉన్న గొడ్డలిగా దానిని అభివర్ణించారు. ఇదే పాత నాని అయి ఉంటే.. నీ అమ్మ మొగుడు.. అంటూ విరుచుకు పడేవారు. ఇప్పుడు మాత్రం భక్తి మాటలు ఆడుతున్నారు. ఎంతలా కొడాలి నాని మారిపోయారు అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అధికారంలో ఉంటే బూతులు.. ప్రతిపక్షంలో ఉంటే భక్తి అన్నట్టు ఉంది కొడాలి నాని పరిస్థితి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper