Homeఆంధ్రప్రదేశ్‌AP Govt good news for Muslim community: చంద్రబాబుకు ఇలా చెప్పారు.. గంటల వ్యవధిలో...

AP Govt good news for Muslim community: చంద్రబాబుకు ఇలా చెప్పారు.. గంటల వ్యవధిలో రూ.45 కోట్లు!

AP Govt good news for Muslim community: ముస్లిం సోదరులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం( AP government ). రంజాన్ సందర్భంగా ప్రత్యేక నిధులను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇమామ్, మౌజన్ లకు గౌరవ వేతనాలు విడుదల చేసింది. రూ.45 ఓట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10000 మందికి ఈ డబ్బులను ఎకౌంట్లో జమ చేయనుంది. రంజాన్ సందర్భంగా తమకు గౌరవ వేతనాన్ని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. హాజరైన సీఎం చంద్రబాబు ఇమామ్, మౌజన్ ల బకాయిలు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈరోజు ఆ నిధులను విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రూ.45 కోట్లు విడుదల చేశారు.

ఆరు నెలలుగా బకాయిలు..
గత ఆరు నెలలుగా ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనం బకాయిలు ఉన్నాయి. ఇఫ్తార్ విందు సందర్భంగా సీఎం చంద్రబాబు( CM Chandrababu) దృష్టికి ఈ సమస్య వచ్చింది. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు గంటల వ్యవధిలోనే ఈ సమస్యను పరిష్కరించారు అధికారులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బకాయిలను విడుదల చేశారు. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా పదివేల మందికి ప్రయోజనం కలగనుంది. నేరుగా ఇమామ్, మౌజన్ల ఖాతాల్లోనే నిధులు జమ కానున్నాయి. గత కొంతకాలంగా ప్రభుత్వం ఇమామ్ లకు పదివేలు, మౌజన్ లకు రూ.5000 గౌరవ వేతనంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. మసీదులతో పాటు ప్రార్ధనాలయాల్లో వీరు సేవలందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచి వీరికి బకాయిలు చెల్లించాల్సి ఉంది. అందుకే ఏపీ ప్రభుత్వం రూ.45 కోట్లను విడుదల చేసింది.

Also Read: ఆ సీనియర్ నేతకు ఇబ్బందిగా డ్రగ్స్ కలకలం!

మారిన పరిస్థితులు..
వాస్తవానికి ముస్లింలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు గా ఉండేవారు. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో టిడిపి వైపు మొగ్గు చూపారు. మరోవైపు బిజెపితో టిడిపి కూటమి కట్టడం వల్ల దూరంగా ఉండేవారు. కానీ ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే ఇప్పుడు గౌరవ వేతనం బకాయిలు విడుదల చేయడంపై ముస్లింలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలను స్వాగతిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version