Peddireddy Ramachandra Reddy
Peddireddy Ramachandra Reddy: వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతలకు ఇబ్బందులు తప్పడం లేదు.ఇప్పటికే ఆ పార్టీ నేతలపై అనేక రకాల కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇలా అరెస్టు అయిన వారు రిమాండ్ లో ఉన్నారు. న్యాయస్థానాల్లో బెయిల్ కూడా లభించడం లేదు. దీంతో మిగతా నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. తాము ఎదుర్కొంటున్న కేసుల్లో ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ముందస్తు బెయిల్ కోసం హై కోర్టు తలుపు తట్టారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పై అభియోగాలు మోపింది సిఐడి. దీంతో తనను అరెస్టు చేయకుండా సిఐడి కి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు మిధున్ రెడ్డి.
* మద్యం భారీ కుంభకోణం..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు( government wine shops ) నడిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారీ కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. సిఐడి సైతం రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, అప్పటి బేవరేజస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే సిఐడి కేసు కూడా నమోదు చేసింది. అయితే ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు పేయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై భిన్నంగా స్పందించింది ఏపీ హైకోర్టు.
* విచారణ చేపట్టిన కోర్టు..
మిధున్ రెడ్డి ( Mithun Reddy)పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టింది హైకోర్టు. కీలక తీర్పు కూడా వెల్లడించింది. మిథున్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎంపీ మిధున్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసి పుచ్చింది. ఈ మేరకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని సిఐడిని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీంతో మిధున్ రెడ్డిని సిఐడి అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయినట్టే. అయితే ఎంపీ మిధున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా మిధున్ రెడ్డి అలానే చేస్తారని తెలుస్తోంది.
* టార్గెట్ కు అదే కారణం..
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయ కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం( pedhi Reddy family ). గత ఐదేళ్లలో పెద్దిరెడ్డి కుటుంబం టిడిపి నేతలను వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పైగా సీఎం చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా అడుగుపెట్టనీయకుండా చేశారు. సహజంగా ఈ పరిణామాలు వారికి మైనస్ గా మారాయి. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై అటవీ భూముల ఆక్రమణల కేసు నమోదయింది. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పై మద్యం కుంభకోణం కేసు నమోదు చేశారు. ఆయన అరెస్టు జరగకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే రక్షణ కల్పించలేమని హైకోర్టు చెప్పడంతో.. మిథున్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..