YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారు. డీ లిమిటేషన్ ప్రక్రియ పై దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఆందోళనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ నేతృత్వంలో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు సమావేశం అయ్యాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేరళ సీఎం పినరాయి విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. తెలంగాణ నుంచి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం హాజరయ్యారు. రాజకీయ బద్ధ విరోధిగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ తో వేదిక పంచుకున్నారు. అయితే ఏపీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం ఉన్న ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పై అనేక రకాల విమర్శలు వచ్చాయి. ఇటువంటి తరుణంలో ఆయన ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.
Also Read : ఏకమైన దక్షిణాది రాష్ట్రాలు.. ఏకీభవించిన చంద్రబాబు.. వైసిపి తటస్థం!
* అందుకే వెనుకడుగు.. జాతీయస్థాయిలో( National wise) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటుంది. అలాగని బిజెపికి దగ్గర పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఈ డీ లిమిటేషన్ ఉద్యమంలో పాలు పంచుకునేందుకు సైతం జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతోనే కేంద్రంతో వైరం పెట్టుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే స్టాలిన్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. అయితే జాతీయస్థాయిలో విమర్శలు వస్తాయని భావించిన జగన్మోహన్ రెడ్డి.. ఈ విషయంలో తన వైఖరి ఏమిటో స్పష్టం చేసేందుకు ముందుకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. డి లిమిటేషన్ వల్ల ఆయా రాష్ట్రాల్లో రాజకీయంగా నలకొన్న ఆందోళనల గురించి ప్రస్తావించారు. ఇదే లేఖను స్టాలిన్ కు సైతం పంపించారు.
* ప్రధానికి రాసిన లేఖ స్టాలిన్ కు..
అయితే జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)ఈ సమావేశానికి హాజరు కాకపోవడంతో పొలిటికల్ గా డ్యామేజ్ జరిగింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెరిగింది. సమావేశానికి వెళ్తే బిజెపికి కోపం వస్తుంది. వెళ్లకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న.. పట్టించుకోవడం లేదన్న విమర్శ వస్తుంది. అందుకే జగన్ లేఖ రాశారు. తనపై వచ్చే విమర్శలు తగ్గించుకునేందుకు ప్రయత్నించారు. లోక్సభ లేదా రాజ్యసభలో ఏ రాష్ట్రానికి కూడా ప్రాతినిత్యం తగ్గకుండా చూసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. 1971, 2011 నాటి జనాభా లెక్కల వివరాలను అందులో పొందుపరిచారు. అండమాన్ నికోబార్ సహా దక్షిణాదిన ఏ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎంత శాతం మేర జనాభా పెరిగింది? తగ్గింది? అనేది వివరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం లోని ఆర్టికల్ 81 (2)(ఏ) కోసం ప్రస్తావించారు. అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు సమానంగా చిన్న రాష్ట్రాలకు కూడా పార్లమెంటులో సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సి ఉంటుందని ఈ ఆర్టికల్ చెబుతోందని వివరించారు. ప్రతి రాష్ట్రంలోనూ సమానంగా సీట్లు పెంచేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి లేక చూస్తుంటే కర్ర విరగకూడదు.. పాము చావకూడదు అన్నట్టు పరిస్థితి ఉంది.
Also Read : అరుదైన ఛాన్స్ మిస్.. భయపడుతున్న జగన్!