Hyderabad
Hyderabad : ఒకప్పుడు హోటల్స్ లో తినడం అంతంతమాత్రం గానే ఉండేది. కానీ కొన్ని సంవత్సరాలుగా బయట తినడం పెరిగిపోయింది. దీనికి తోడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు అందుబాటులోకి రావడంతో హోటల్స్ పెరిగిపోయాయి. దీనికి తోడు రకరకాల మెనూలు అవి అందుబాటులోకి తెచ్చాయి. దీంతో ఇంట్లో వండడం తగ్గిపోయి.. బయట తినడం పెరిగిపోయింది. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో హోటల్ నిర్వాహకులు అడ్డదారులు కూడా మొదలుపెట్టారు. వినియోగదారులను దేవుళ్ళతో సమానంగా చూడాల్సిన చోట.. పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. పురుగులు కూడా ఇష్టపడని తిండి పెడుతున్నారు. ఫలితంగా వాటిని తిన్నవారు రోగాల పాలవుతున్నారు.. ఆహార తనిఖీ శాఖ అధికారుల సోదాలలో ఈ భయంకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి.
Also Read : టన్నుల కొద్దీ కుళ్లిన మాసం.. నెలల తరబడి ఫ్రీజింగ్.. పెళ్లిళ్లు, శుభకార్యలు, హలీం సెంటర్లకు సరఫరా!
ఆహార తనఖీ శాఖ అధికారుల సోదాలలో..
కొంతకాలంగా హైదరాబాదులో ఫుడ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. పేరుపొందిన హోటల్స్ పై దాడులు చేయగా.. దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులో వస్తున్నాయి. దీంతో పేరుపొందిన హోటల్స్ కు ఆహార తనిఖీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. భారీగా జరిమానాలు విధించినప్పటికీ హోటల్స్ నిర్వాహకుల తీరు మారడం లేదు. తాజాగా ఐటి కార్యకర్తలకు కేంద్ర బిందువుగా ఉన్న గచ్చిబౌలి ప్రాంతంలో పేరుపొందిన హోటల్ లో ఆహార తనిఖీ శాఖ అధికారులు దాడులు చేశారు. అక్కడ పరిశోధన చూసి అధికారులు కూడా షాక్ కు గురయ్యారు. అల్లం వెల్లుల్లి పేస్టుకు బూజు పట్టింది. కారం రంగు మారి కనిపించింది. మసాలా దినుసులు నల్లగా ఉన్నాయి. కూరలలో వినియోగించే ఇతర పదార్థాలు పురుగులు పట్టి దర్శనమిచ్చాయి. ఇక డ్రైనేజీ అయితే అత్యంత దారుణంగా ఉంది. అటువంటి ఆహార పదార్థాలకు రకరకాల రంగులు, ఇతర దినుసులు అద్ది కస్టమర్లకు వడ్డిస్తున్నారు . ఆహార తనిఖీ శాఖ అధికారుల ఈ దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి రావడంతో వారు కూడా షాక్ కు గురయ్యారు. ఈ దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయి. ఇటువంటి తిండిని చివరికి పురుగులు కూడా తినవని.. అటువంటి వాటిని మనుషులు తింటున్నారని అధికారులు వాపోతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆహారతనిఖీ శాఖ అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..” డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి తిండి మనుషులకి పెడితే ఎలా? ఇలాంటి తిండి తిని మనుషులు బతుకుతారా? ఆ స్థానంలో మీరు ఉంటే.. మీక్కూడా అలాంటి భోజనమే పెట్టాలి. అపరిచితుడు సినిమాలో క్రిమి భోజనం అనే శిక్షనే మీకు కరెక్టు” అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న హోటల్ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read :మటన్ తింటున్నారా..హైదరాబాద్లో 12 టన్నుల మేక మాంసం పట్టివేత
,
21.03.2025* Kitchen found to be in unhygienic condition with unclean walls and broken flooring.
* Exhaust is greasy and oil found to be dripping.
* Water stagnation observed due to clogged drains. Food waste thrown… pic.twitter.com/qRIV8ESzbm
— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) March 21, 2025