Homeఆంధ్రప్రదేశ్‌Joseph Ravan: జగన్ ను దూషించిన జోసెఫ్ రావణ్!

Joseph Ravan: జగన్ ను దూషించిన జోసెఫ్ రావణ్!

Joseph Ravan: జోసెఫ్ రావణ్ వ్యవహారంలో డ్యామేజ్ కంట్రోల్ లో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే రావణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి పై చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెరపైకి తెస్తోంది. తాము జోసెఫ్ రావణ్ కు అసలు మద్దతు తెలపడం లేదని.. ఆయనపై మోపిన కేసులను.. అరెస్టులను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పుకోస్తోంది. జోసెఫ్ రావణ్ ఎపిసోడ్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు రావడంతో ఆ పార్టీ డామేజ్ కంట్రోల్లో పట్టింది. అందుకే ఇప్పుడు కొత్త ప్రచారానికి తెర తీసింది. అయితే ఇప్పుడు ఆయన విషయంలో ప్రత్యేక ప్రచారం చేస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా బుక్ అయినట్లు అర్థం అవుతోంది.

* దేశద్రోహం కేసు..
పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు జోసెఫ్ రావణ్. డిప్యూటీ సీఎం తో పాటు సీఎం చంద్రబాబుపై కూడా కామెంట్స్ చేశారు. అయితే ఈ విమర్శలే కాదు గతంలో ఆయన చేసిన వివాదాస్పద కామెంట్స్ ను పరిగణలోకి తీసుకొని.. దీని వెనుక పెద్ద కుట్ర ఉందని అనుమానిస్తూ పోలీసులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో హిందూ దేవుళ్ళతో పాటు దేవతలను దారుణంగా కించపరిచిన జోసెఫ్ రావణ్ అరెస్టు సహేతుకం అని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హిందుత్వవాదులు అయితే ఆహ్వానిస్తున్నారు. కానీ అదే సమయంలో జోసెఫ్ రావణ్ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని.. ఆయనకు న్యాయసహాయం అందిస్తోందని ప్రచారం జరిగింది. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.

* డ్యామేజ్ కంట్రోల్
ఇప్పటికే హిందుత్వ వ్యతిరేక ముద్ర వైసిపి పై ఉంది. దీంతో ఈ అంశం ప్రజల్లోకి వెళ్లడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్నర్ అవుతోంది. జోసెఫ్ రావణ్ అరెస్ట్ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు గన్నవరం ఎయిర్పోర్ట్ లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. న్యాయసహాయాన్ని అర్థించారు. ఆ విషయం చూడమని దేవినేని అవినాష్కు పురమాయించారు జగన్.. ఇంతలో జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించడం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం ఎంట్రీ కావడం జరిగింది. దీంతో రావణ్ వెనుక వైసిపి ఉందనేది ప్రజల్లోకి వెళ్ళింది. ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ కార్నర్ అవుతోంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుండడంతో వైసిపి డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా.. గతంలో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసిన జోసెఫ్ రావణ్ వీడియోలను సోషల్ మీడియాలో హైలెట్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version