అయితే జేసీ ప్రభాకరరెడ్డి ఆరోపణలపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పందించారు. సీఐ ఆనందరావు ఆత్మహత్యను రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నారని.. కుటుంబ కలహాలతో సీఐ ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని.. టీడీపీ పాలనలో పోలీసులపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు అందరికీ తెలుసన్నారు. సీఐ ఆనందరావు ఆత్మహత్య కేసును పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Tadipatri CI Death : తాడిపత్రి సీఐ ఆత్మహత్య వెనుక జేసీ ప్రభాకరరెడ్డి..వీడియో హల్ చల్
Tadipatri CI Death : తాడిపత్రి సీఐ ఆనందరావు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ కలహాలతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీస్ శాఖ చెబుతుండగా.. రాజకీయ ఒత్తిళ్లతోనే బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తాడిపత్రి మునిసిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. రాజకీయ ఒత్తిళ్లతోనే సీఐ ఆనందరావు చనిపోయారని ఆరోపించారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచి టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
అయితే ఇప్పుడు సెడన్ గా ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. తెగ వైరల్ అవుతోంది. సీఐ ఆనందరావును జేసీ ప్రభాకరరెడ్డి దుర్భాషలాడుతూ తోసివేస్తున్నట్టు వీడియో ఒకటి బయటకు వచ్చింది. వైసీపీ శ్రేణులు దీనిని వైరల్ చేస్తున్నాయి. పోస్టులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నాయి. సీఐ ఆనందరావు ఆత్మహత్య బాధ్యుడు జేసీ ప్రభాకరరెడ్డేనని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చనిపోయిన తరువాత రాజకీయ ఒత్తిళ్లు అంటూ ప్రభాకరరెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సందేహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం ఉద్దేశపూర్వకంగా అన్నట్టు అనుమానాలు కలిగేలా ఈ వీడియోలు ఉండడం విశేషం. టీడీపీ శ్రేణులు మాత్రం ఎప్పుడో పాత వీడియోలని చెబుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన సమయంలో తీసినవని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Most Popular
loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!
loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..
Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...
Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..
Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..
ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..
Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...







