Homeఆంధ్రప్రదేశ్‌MLA Bolishetti Srinivas : నిన్ను అసలు ఎవడు పిలిచాడు..నీకు ఫ్యాన్స్ కూడా ఉంటారా' అంటూ...

MLA Bolishetti Srinivas : నిన్ను అసలు ఎవడు పిలిచాడు..నీకు ఫ్యాన్స్ కూడా ఉంటారా’ అంటూ అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు!

MLA Bolishetti Srinivas : అల్లు మరియు మెగా మధ్య నడుస్తున్న అంతర్గత పోరు నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా వరకే పరిమితం లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఇరు పక్షాలకు చెందిన పెద్దలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సంచలనం గా మారింది. మొన్న అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి జరుగుతున్న ఈ గొడవలపై మాట్లాడుతూ ‘పుష్ప చిత్రంపై పవన్ కళ్యాణ్ అలా మాట్లాడడం సరికాదు. ఆయన దీనిపై స్పందించి వివరణ ఇవ్వాలి. అప్పుడే ఈ గొడవలు ఆగుతాయి’ అంటూ ఒక మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. అంతకు ముందు అల్లు అర్జున్ ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ‘నా మనసుకి నచ్చితే ఎక్కడికైనా వస్తా..అది మీ అందరికి కూడా తెలుసు’ అంటూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూనే ఉంది.

దీని మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై జనసేన పార్టీ తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చాలా తీవ్రంగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘ అల్లు అర్జున్ కి అభిమానులు ఉన్నారు అనడం ఇదే నేను మొట్టమొదటిసారి వింటున్నాను. మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులే ఆయనకి ఉన్నారు. ఆయన తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎదో అభిమానులు ఉన్నట్టుగా ఊహల్లో తేలుతున్నాడు. మొన్న నాకు ఇష్టం ఉంటేనే వస్తా, లేకపోతే రాను అన్నాడు. అసలు నిన్ను ఎవడు పిలిచాడు?, నువ్వు నంద్యాల కి వెళ్లి నీ మిత్రుడిని ఓడగొట్టావు. మేము 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలిచాము. నువ్వు గత ఎన్నికలలో మీ నాన్నని ఎంపీ గా గెలిపించుకోలేకపోయావు’ అంటూ చాలా తీవ్ర స్థాయిలో స్పందించాడు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ రేంజ్ కామెంట్స్ చేసాడంటే, చిరంజీవి – పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా అల్లు అర్జున్ పై ఇదే స్థాయి కోపంతో ఉన్నారా? అనే అనుమానాలు ఇప్పుడు అభిమానుల్లో నెలకొన్నాయి.

ఈ గొడవ ఎక్కడో ఒక చోట ఆగుతుంది అనుకుంటే, రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ఒక్కటైతే నిజం, అల్లు అర్జున్ కి బయట చాలా తీవ్రంగా నెగటివిటీ పెరిగింది. అల్లు అర్జున్ కి టీడీపీ లో కూడా జేసీ అస్మిత్ రెడ్డి అనే స్నేహితుడు ఉన్నాడు. ఆయన కూడా అల్లు అర్జున్ కి శిల్పా రవి లాంటి స్నేహితుడే. కానీ ఇప్పటి వరకు అతని గురించి కనీసం ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు. శిల్పా రవి కి 2019 ఎన్నికలలో ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాడు, ఈ ఎన్నికలలో నేరుగా నంద్యాల కి వెళ్లి తన సపోర్ట్ ని తెలిపాడు. ఇది కావాలని చేసింది కాక మరేంటి అని అభిమానులు అల్లు అర్జున్ ని నిలదీస్తున్నారు.

నోరు జాగ్రత్త..బ్రదర్🔥MLA Bolisetty Srinivas Counter To Allu Arjun Over His Comments | Chiranjeevi

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version