Prashna Ravan : గత కొంతకాలంగా ‘ప్రశ్న రావణ్’ పేరు రాష్ట్ర రాజకీయాల్లో ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పై , హిందూ సమాజం పై ద్వేష పూరిత ప్రసంగాలు ఇవ్వడమే పని పెట్టుకున్న ఈయనపై జనసేన పార్టీ నాయకులూ కేసులు వేశారు. మొదటి నాలుగు కేసుల్లో బెయిల్ రాగా, 5 వ కేసు గా తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా వీడియోలు చేస్తూ యువత ని తప్పుదోవ పట్టించేందుకు చేసినందుకు గానూ ఆయనపై UAPA చట్టం క్రింద కేసు నమోదైంది. దీంతో గన్నవరం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పర్చగా , 14 రోజుల రిమాండ్ విధించడంతో , నెల్లూరు జైలు కి రావణ్ ని తరలించారు. అయితే రిమాండ్ లోకి తీసుకున్న తర్వాత విచారణ లో రావణ్ గురించి తెలిసిన కొన్ని సంచలన నిజాలు ఇప్పుడు మీడియా ని షేక్ చేస్తోంది.
అమాయకమైన స్త్రీలను వశపరుచుకొని , వాళ్ళతో శృంగారం చేసిన వీడియోలు ఇతని ఫోన్ కి 10 కి పైగానే ఉన్నాయి. ఈ వీడియోల ద్వారా వాళ్ళను బెదిరించి డబ్బులు కూడా వసూలు చేసాడట రావణ్. అంతే కాకుండా అతనికి ఉన్నటువంటి లింకులు ఒక్కొక్కటిగా బయటపడడంతో , ఇతనికి సపోర్టుగా వచ్చిన వాళ్లంతా ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. వారిలో మొదటి వరుసలో నిలబడిన వ్యక్తి జడ శ్రవణ్. రీసెంట్ గానే రావణ్ కేసు జడ శ్రవణ్ నుండి పొన్నవోలు సుధాకర్ చేతుల్లోకి వెళ్ళింది. దీనిపై జడ శ్రవణ్ తీవ్రమైన అసంతృప్తి ని వ్యక్తం చేశారు. మొదటి నాలుగు కేసుల్లో బెయిల్ ఇప్పించినప్పటికీ , నాపై వారికి నమ్మకం లేదు , పొన్నవోలు సుధాకర్ ద్వారానే న్యాయం జరుగుతుందని నమ్మారు అంటూ మీడియా ముందు జడ శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
జడ శ్రవణ్ మాట్లాడుతూ ‘ప్రశ్న రావణ్ అనే వ్యక్తి శ్రీరాముడిపై , శ్రీ కృష్ణుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాల్సిన అంశం , అందులో ఎలాంటి సందేహం లేదు. మతం అనేది వ్యక్తిగతమైన విషయం. నీ మతం మీద గౌరవం ఉంటే పూజించుకో, పరాయి మతం నచ్చకపోతే సైలెంట్ గా ఉండు , అంతే కానీ ఇతర మతాలను కించపరిచే హక్కు నీకు లేదు’ అంటూ మండిపడ్డారు జడ శ్రవణ్. ఏ వ్యక్తి కోసం అయితే ఆయన ఇన్ని రోజులు పోరాడారో , అదే వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది .
