https://oktelugu.com/

Hero Nani : ఈగ’ కంటే హీనంగా తీసేశారు.. రాజమౌళి వద్దనడంపై హీరో నాని సంచలన కామెంట్స్

దర్శకుడు రాజమౌళిని ఉద్దేశిస్తూ నాని చేసిన లేటెస్ట్ కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ఈగ 2 ఎప్పుడు చేద్దామని అడిగిన నాని తో రాజమౌళి నీ అవసరం లేదని అన్నాడట. పాపం నానిని రాజమౌళి ఈగ కంటే దారుణంగా తీసేశాడనే వాదన తెరపైకి వచ్చింది.

Written By:
  • S Reddy
  • , Updated On : August 27, 2024 / 07:46 PM IST

    Hero nani comments On eega 2

    Follow us on

    Hero Nani : హీరో నాని ‘ సరిపోదా శనివారం ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మూవీ పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. సరిపోదా శనివారం సినిమాతో నాని హ్యాట్రిక్ విజయం అందుకోవడం పక్కా అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నాని పలు ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఈగ సీక్వెల్ ని ఉద్దేశిస్తూ హీరో నాని చేసిన లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

    హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలో ఈగ సినిమా నానికి భారీ విజయం అందించింది. 2012లో ఈగ సినిమా రిలీజ్ అయింది. ఆయన కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈగ సంచలనం సృష్టించింది. చిన్న ఈగతో కూడా బ్లాక్ బస్టర్ సినిమా తీయొచ్చని రాజమౌళి నిరూపించాడు. ఈ సినిమాకి 2 నేషనల్ అవార్డ్స్, 3 సైమా అవార్డులు, 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి.

    సమంత హీరోయిన్ గా నటించింది. సుదీప్ విలన్ గా నటించాడు. అయితే గతంలో రాజమౌళి ఈగ 2 గురించి ప్రస్తావించాడు. సీక్వెల్ చేసే ఆలోచన ఉందని అన్నారు. ఈ క్రమంలో ఓ సందర్భంలో ఈగ 2 గురించి రాజమౌళి తో జరిగిన సంభాషణను నాని గుర్తు చేసుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ .. విజయేంద్ర ప్రసాద్ గారితో నేను ఎప్పుడూ ఈగ సీక్వెల్ గురించి మాట్లాడలేదు. రాజమౌళి సార్ తో సరదాగా ఒకసారి చర్చించాను.

    ఈగ 2 చేద్దాం అన్నారు కదా .. చెప్పండి ఎప్పుడు మొదలు పెడదాం అన్నాను. దానికి రాజమౌళి మేము ఈగ 2 చేసినా మాకు నీ అవసరం ఉండదు. ఆ ఈగ మళ్లీ తిరిగి వస్తుంది అన్నారు, అని నాని చెప్పాడు. ఫస్ట్ పార్ట్ లో నాని చనిపోయాడు కాబట్టి. కథలో నాని పార్ట్ ముగిసింది. ఆ ఉద్దేశంతో రాజమౌళి అలా చెప్పి ఉంటారు. నాని కొత్త సినిమా ‘ సరిపోదా శనివారం ‘ ఆగస్టు 29న పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

    ఈ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ జే సూర్య విలన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. నాని స్ప్లిట్ పర్సనాలిటీ కలిగిన వ్యక్తిగా కనిపిస్తారట. గతంలో వివేక్ ఆత్రేయ-నాని కాంబోలో వచ్చిన అంటే సుందరానికీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. సరిపోదా శనివారంతో మాత్రం గట్టిగా కొడతామని నాని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు.