spot_img
Homeఆంధ్రప్రదేశ్‌TDP Janasena Alliance: ఆ నాలుగు సీట్లు అడుగుతున్న జనసేన

TDP Janasena Alliance: ఆ నాలుగు సీట్లు అడుగుతున్న జనసేన

TDP Janasena Alliance: కృష్ణాజిల్లాలో జనసేన నాలుగు సీట్లు డిమాండ్ చేస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో వాటిని కేటాయించాలని పట్టుబడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టిడిపి, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. మధ్యలో బిజెపి విషయం తేలనుండడంతో తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ ప్రాతినిధ్యం ఉండాలని జనసేన కోరుకుంటుంది. కొన్ని జిల్లాల్లో మెజారిటీ సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశం ఉంది. అటు కృష్ణా జిల్లాలో సైతం ఏకంగా 4 సీట్లు అడుగుతున్నట్లు సమాచారం.

ప్రధానంగా విజయవాడ పశ్చిమ, పెడన, కైకలూరు, అవనిగడ్డ సీట్లు జనసేన అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం అధికం. అందుకే ఈ సీట్లలో పోటీ చేస్తే సునాయాసంగా గెలుపొందుతామని జనసేన అంచనా వేస్తోంది. పెడన సీటును జనసేనకు కేటాయించాలని అభ్యర్థన వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎంపీ బాలశౌరి కుమారుడి కోసం సీటును పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టిడిపి నుంచి మాజీమంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణ ప్రసాద్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.

అవనిగడ్డ నియోజకవర్గాన్ని సైతం జనసేన ఆశిస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడ జనసేన టికెట్ ఆశిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థిగా విక్కుర్తి శ్రీనివాస్ పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మండలి బుద్ధ ప్రసాద్ ను తప్పించి జనసేనకు చంద్రబాబు టిక్కెట్ కేటాయిస్తారా? లేదా? అన్నది చూడాలి.

విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని సైతం జనసేన ఆశిస్తోంది.ఇక్కడ జనసేన నేతగా ఉన్న పోతిన మహేష్ పార్టీలో యాక్టివ్ గా పని చేస్తున్నారు. తప్పకుండా ఈ సీటు జనసేనకు కేటాయిస్తారని ఆయన ఆశిస్తూ ఉన్నారు. మరోవైపు టిడిపి నుంచి జలీల్ ఖాన్, నాగుల్ మీరా, బుద్ధ వెంకన్నలు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరోవైపు పోతిన మహేష్ పవన్ ను కలిసి టిక్కెట్ అభ్యర్థించినట్లు తెలుస్తోంది. కైకలూరు సీటును సైతం జనసేన ఆశిస్తోంది. టిడిపి ఇన్చార్జిగా ఉన్న జయ మంగళ వెంకటరమణ వైసీపీలో చేరారు. దీంతో ఈ సీటును జనసేన ఆశిస్తోంది. ఒకవేళ బిజెపితో పొత్తు కుదిరితే.. ఈ సీటును ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉంది. గతంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కామినేని శ్రీనివాస్.. ఎమ్మెల్యేగా గెలుపొంది టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.మొత్తానికైతే కృష్ణా జిల్లాలో జనసేన నాలుగు సీట్లను ఆశిస్తుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper