https://oktelugu.com/

Jagan: ఆ విషయంలో జగన్ ది స్వయంకృతాపరాధమా?

గత ఎన్నికలకు ముందు జగన్కు అత్యంత వీర విధేయత చూపే ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు.

Written By:
  • Dharma
  • , Updated On : April 21, 2024 / 01:55 PM IST

    Jagan

    Follow us on

    Jagan: నెల్లూరులో లెక్క తప్పుతోంది. ఈసారి వైసీపీకి సాలిడ్ విజయం కష్టమేనని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల మాదిరిగా ఏకపక్షంగా గెలిచేస్తామని భావించడం అంత ఈజీ కాదు. ఇక్కడ టిడిపి పట్టు బిగించడం అనే దానికంటే.. వైసీపీ స్వయంకృతాపం ఆ పార్టీకి శాపంగా మారనుంది. 2014 ఎన్నికల్లో మెజారిటీ సీట్లను వైసీపీ సాధించింది. 2019 ఎన్నికల్లో అయితే వైట్ వాష్ చేసింది. పది నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత.. గత ఐదేళ్లలో పూర్తిగా సీన్ మారింది. గత ఎన్నికలకు ముందు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అని జగన్ ను కొలిచిన వారే ఎదిరించడం ప్రారంభించారు. ఒక్కొక్కరు పార్టీని వీడారు.

    గత ఎన్నికలకు ముందు జగన్కు అత్యంత వీర విధేయత చూపే ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన జగన్ పై ఈగ వాలనిచ్చేవారు కాదు. కానీ అనూహ్యంగా ఆయన పార్టీకి దూరమయ్యారు. ఆయనతోపాటు సీనియర్లు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల ముంగిట వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టిడిపిలోకి జంప్ చేశారు. దీంతో నెల్లూరులో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వదులుకోవద్దు అని చాలామంది నేతలు వైసిపి హై కమాండ్ ను కోరారు. అయితే జగన్ మాత్రం లైట్ తీసుకున్నారు. వేమిరెడ్డి వెళ్లిపోయిన పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి.. విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.

    అయితే నెల్లూరు జిల్లాలో పెద్ద రెడ్లు టిడిపి వైపు పూర్తిగా టర్న్ అయినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి బిగ్ షాట్ ఎంపీగా పోటీ చేస్తుండడంతో.. పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒక మూడు సీట్లు మాత్రం టిడిపి ఖాతాలో పడే ఛాన్స్ కనిపిస్తోంది. మరో మూడింట హారహోరి ఫైట్ ఉన్నా.. టిడిపి ఎడ్జ్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి నెల్లూరులో ఒకే ఒక సీటు వైసీపీకి దక్కే పరిస్థితి ఉంది.పదికి పది సీట్లు దక్కించుకున్న చోట.. ఒక స్థానానికే పరిమితం అవడం అధినాయకత్వం చేసుకున్న స్వయంకృతాపం.

    జగన్ అధికారంలోకి రాగానే మంత్రివర్గంలోకి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి కాదని అనిల్ కు ఛాన్స్ ఇవ్వడంతో ఆయన రెచ్చిపోయారు. ఒక్క జగన్ తోనే తనకు పని అన్నట్టు వ్యవహరించారు. నెల్లూరు జిల్లాలో విభేదాలకు కారణమయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరం కావడానికి కూడా అనిల్ యాదవ్ కారణం. జగన్ అనిల్ కు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతోనే పార్టీలో ఇబ్బందికర పరిణామాలు ఎదురైనట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ కంచుకోట.. కళ్ళ ఎదుటే మంచు కోటల కరిగిపోవడం వైసీపీకి ఇబ్బందికర పరిణామమే. మరి ఈ ఇబ్బందికర పరిస్థితులను వైసిపి ఎలా అధిగమిస్తుందో చూడాలి.