Kamma: కమ్మరాజ్యంగా విశాఖ ఎందుకు మారింది? అసలు కథేంటి?

ప్రస్తుతం విజయవాడలో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉంది. అయితే ఉమ్మడి ఏపీ సమయంలోనే విశాఖలో కమ్మ సామాజిక వర్గం పాగా వేసినట్లు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : April 21, 2024 1:59 pm

Kamma

Follow us on

Kamma: అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం ఉంటుందన్నది ఒక విమర్శ. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం విస్తరించడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. స్వాతంత్రానికి మునుపు బ్రిటిష్ సామ్రాజ్యంలో సైనిక ఆధిపతులుగా కమ్మ వారే ఉండేవారని.. అందుకే వారు నీరున్నచోట పంటలు పండించేందుకు ప్రయత్నాలు చేశారని.. అప్పట్లో తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని ఆస్తులు పొందారనిఒక విశ్లేషణ ఉంది.అందుకు తగ్గట్టుగానే కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గానికి అధికంగా ఆస్తులు ఉన్నాయి. తొలుత వ్యవసాయం, తరువాత రవాణా, ఆటోమొబైల్ రంగాల్లో కమ్మ సామాజిక వర్గం వారు రాణించేవారు.ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి వారు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఆ రంగంలో పాతుకు పోయారు. అటు మీడియా లో సైతం తమకు తాము నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఆ రంగంలో కూడా రాణించగలుగుతున్నారు.

ప్రస్తుతం విజయవాడలో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం అధికంగా ఉంది. అయితే ఉమ్మడి ఏపీ సమయంలోనే విశాఖలో కమ్మ సామాజిక వర్గం పాగా వేసినట్లు తెలుస్తోంది. విశాఖలో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్లో ఏకంగా 80% కమ్మ సామాజిక వర్గం వారి చేతిలో ఉన్నాయి. సినిమా థియేటర్ల పరిస్థితి అంతే. 80% థియేటర్లు వీరివేనని తెలుస్తోంది. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆ సామాజిక వర్గం వారి చేతిలో ఉన్నాయి.

ఒక్క హోటళ్లు, థియేటర్లలో కాదు. వాహనాల షోరూంలు సామాజిక వర్గానికి చెందిన వారివే. మాజీ ఎంపీ మురళీమోహన్ ఏనాడో ఇక్కడ షో రూమ్లను విస్తరించారు. ప్రముఖ కంపెనీల కార్ల షో రూమ్లను దశాబ్దాల కిందటే ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల కిందట రామానాయుడు 15 ఎకరాల భూమిని పొందగలిగారు. వీడియోను కట్టేశారు. ఇక గీతం విద్యా సంస్థల గురించి చెప్పనవసరం లేదు. వేలకోట్ల రూపాయల భూములు ఆ సంస్థ సొంతం. ఇక నగరంలో పేరుమోసిన పెట్రోల్ బంకుల యజమానులు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇలా ఎలా చూసుకున్నా విశాఖ నగరంలో వేల కోట్ల రూపాయల ఆస్తులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారివే. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైయస్ విజయమ్మ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కడప సంస్కృతి అన్న స్లోగన్ వెనక కమ్మ సామాజిక వర్గం ఆందోళన ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి విశాఖ రాజధాని అంశంలో సైతం వారిలో ఒక రకమైన భయం వెంటాడింది. కేవలం కమ్మ సామాజిక వర్గం పై రెడ్డి డామినేషన్ పెరుగుతోందన్న ఆందోళనతోనే వారు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.