Result Time: తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మూల్యాకనం పూర్తయింది. రెండోసారి క్రాస్ చెక్ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం విద్యార్థుల మార్కుల కంపూటరీకరణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఫలితాలు విడుదల చేసే తేదీలను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇక పదో తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. ఈ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈనెలాఖరులోగా ఫలితాలు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఏప్రిల్ 30 లేదా మే 1న ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
పరీక్షలు ఇలా…
రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు నిర్వహించారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 10 నుంచి మూల్యాంకనం చేపట్టారు. ఏప్రిల్ 10వ తేదీ వరకు పూర్తి చేశారు. మార్కుల నమోదుతోపాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జవాబు పత్రాలను మూyýససార్లు పరిశీలించారు. కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తిచేశారు. 2023 ఏడాదిలో మే 9న ఇంటర్ ఫలితాలు ప్రకటించారు. ఈసారి అంతకన్నా ముందే ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 24వ తేదీని ఖరారు చేశారు.
పది పరీక్షలు ఇలా..
ఇక పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు 5,08,385 మంది హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రశ్నపత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 20తో పూర్తయింది. ప్రస్తుతం జవాబు పత్రాల పునఃపరిశీలన, సాంకేతిక సమస్యల పరిష్కారం, మార్కుల కంపూటరీకకణ జరుగుతుంది. ఈ ప్రక్రియ వారం రోజులు జరుగుతుంది. ఫలితాల కోడింగ్ అనంతరం ఏప్రిల్ 30 లేదా మే 1న ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈమేరకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి కూడా లభించింది.