Jagan vs Yellow Media War: వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy )ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయ ప్రత్యర్థులతో పోరాటం చేయడం లేదని.. ఎల్లో మీడియా సామ్రాజ్యం తో చేస్తున్నానని చెప్పడం విశేషం. నిన్ననే జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్మ నేతలను చంద్రబాబు వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. కమ్మ సామాజిక వర్గం పేరును తెరపైకి తెస్తూ వ్యాఖ్యానాలు చేశారు. ఈరోజు నాణేనికి రెండో వైపు అంటూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పాత మాటలనే మళ్లీ వ్యాఖ్యానించారు. ఆ నాలుగు మీడియా సంస్థలను ఎల్లో మీడియాతో పోలుస్తూ కామెంట్స్ చేశారు.
ఏనాడో మీడియా విభజన
ఏపీలో( Andhra Pradesh) రాజకీయ పార్టీల పరంగా మీడియా విడిపోవడం ఏనాడో జరిగిపోయింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాను ఎల్లో మీడియా గాను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియాను నీలి మీడియా గాను.. అటు ఇటుగా వ్యవహరించే మీడియాను తటస్థ మీడియా గా అభివర్ణిస్తుంటారు. అయితే టిడిపికి అనుకూలంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ ఉన్నాయని పదేపదే చెబుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అది నిజమే కావచ్చు కానీ.. తన పోరాటం ఈ ఎల్లో మీడియా పైనేనని జగన్మోహన్ రెడ్డి చెప్పడం మాత్రం విశేషమే. అయితే ప్రజల్లోకి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ మీడియా కథనాలు ప్రచురిస్తుండడంతో ఆశించిన స్థాయిలో మైలేజీ రావడం లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానాలు ఉన్నాయి.
Also Read: Manchu Lakshmi- Jagan: జగన్ నే ట్రోల్ చేసిన మంచు లక్ష్మి..అంతా అవాక్కు
ఆది నుంచి అంతే..
ఆది నుంచి ఎల్లో మీడియా( yellow media) అంటూ జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతూ వస్తుంటారు. అదే సమయంలో తనకు ఒక మీడియా ఉంది అని మాత్రం ఒప్పుకోరు. అసలు తనకు సాక్షి మీడియాతో సంబంధం లేదని చెబుతుంటారు. కానీ అదే మీడియాలో పతాక శీర్షిక తనకు అనుకూల కథనాలు వస్తుంటాయి. ఆయన ప్రత్యర్థులపై వ్యతిరేక కథనాలు వస్తుంటాయి. ఆపై పత్రికతో పాటు టీవీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎల్లో మీడియా అంటూ జగన్ చెప్పడం పరిపాటిగా మారింది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత కూడా ఇంకా ఎల్లో మీడియా అంటూ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే అదో బలమైన వ్యవస్థ అన్నట్టు జగన్ కామెంట్స్ ఉంటున్నాయి. కేవలం వాటి ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరిన విధంగా ఉన్నాయి జగన్ వ్యాఖ్యలు. అయితే ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. మీడియా విషయంలో వారికి ఒక అవగాహన ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నేతలు ఎందుకు ఈ ప్రకటనలు చేస్తున్నారో కూడా వారికి తెలుసు. ప్రభుత్వ వైఫల్యాలు చెప్పవచ్చు కానీ పదేపదే ఎల్లో మీడియా అనడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి వచ్చే లాభం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రెస్ మీట్ నాణ్యానికి రెండో వైపు
టీడీపీ, ఎల్లోమీడియాతో యుద్ధం చేస్తున్నాం
-వైఎస్ జగన్ pic.twitter.com/HMZ8oB0K3w
— Rahul (@2024YCP) June 19, 2025