Kingdom Movie Postponed: వాయిదాలు పడే విషయం లో ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeraallu) కి పోటీ అయ్యేట్టు ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని మే 31 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. అప్పటికి చాలా వరకు షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో జులై 4 కి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన విడుదల అవ్వడం కూడా కష్టమే, జులై 25 న విడుదల అయ్యేందుకు ఫిక్స్ చేసినట్టు సమాచారం. కానీ ఇప్పుడు ఆ తేదీన విడుదల అవ్వడం కూడా కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే ఈ ‘హరి హర వీరమల్లు’ మూవీ జులై 24 న విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇది ఈ రెండు సినిమాల మధ్య పోటీ అనే దానికంటే, రెండు సినిమాల ఓటీటీ సంస్థల మధ్య పోటీ అనడం పర్ఫెక్ట్ గా ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.
నెట్ ఫ్లిక్స్ సంస్థ ‘కింగ్డమ్’ చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో జులై 25 నే విడుదల చేయాలని చాలా బలంగా చెప్తుందట. ముందుకు కదిలితే కచ్చితంగా ముందు అనుకున్న రేట్ కి కోతలు విధిస్తామని బలంగా వార్నింగ్ ఇచ్చిందట. మరోపక్క హరి హర వీరమల్లు పరిస్థితి కూడా అదే. గత వారం రోజులుగా ఆ చిత్ర నిర్మాత AM రత్నం అమెజాన్ ప్రైమ్ సంస్థ తో చర్చలు జరుపుతుం ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం ఈ ఏడాదిలో మూడు సార్లు వాయిదా పడింది. ఆ మూడు సార్లు అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) నిర్మాతలకు అనుకూలంగానే వ్యవహరించింది కానీ, నాల్గవసారి మాత్రం అసలు ఒప్పుకోవడం లేదు. వాళ్ళు చెప్పిన తేదిలోనే రావాలి, లేకుంటే పెనాల్టీ కట్టాల్సిందే. అందుకే వీళ్ళు కూడా జులై 24 న రావాల్సిన పరిస్థితి.
Also Read: Kingdom Review : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా…
అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘కింగ్డమ్’ చిత్రం అగష్టు 7 కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. నెట్ ఫ్లిక్స్(Net flix) సంస్థ ఒకవేళ జులై 25 న రిలీజ్ మిస్ అయితే, ఆగష్టు 7 న విడుదల చేయాలి అనేది చివరి ప్రతిపాదన. ఇందుకు నిర్మాత నాగవంశీ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే నేడు ‘హరి హర వీరమల్లు’ టీం అమెజాన్ ప్రైమ్ సంస్థ తో చివరిసారి భేటీ కాబోతుంది. ఈ భేటీ తో విడుదల తేదీని ఖరారు. నిర్మాతకు అనుకూలంగా అమెజాన్ ప్రైమ్ నిర్ణయం తీసుకుంటే ఈ చిత్రం జులై 17 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. లేకపోతే జులై 24 న రావాల్సిందే. అప్పుడు కింగ్డమ్ చిత్రాన్ని కచ్చితంగా అగష్టు కి వాయిదా పడే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఈ రెండు సినిమాల పై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.