Jagan And Sharmila: తండ్రి కోసం ఒకే వేదిక పైకి జగన్, షర్మిల.. ఏం జరుగనుంది?

ఏటా వైఎస్సార్ జయంతి నాడు ఇడుపాలపాయలో ఆయనస్మారక వనం వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సభ్యులంతా ఒకేసారి ఈ కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 3, 2024 2:42 pm

Jagan And Sharmila

Follow us on

Jagan And Sharmila: ఏపీలో ఎన్నికలతో రాజకీయం చల్లబడింది. వైసిపి ఘోర ఓటమితో ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా డీలా పడ్డాయి. కానీ ఇప్పుడిప్పుడే అధినేత జగన్ యాక్టివ్ అవుతున్నారు. ఓదార్పు యాత్రలకు సిద్ధమవుతున్నారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ పరామర్శించనున్నారు. అటు తరువాత కడప జిల్లాకు వెళ్ళనున్నారు. ఒకే రోజు.. ఒకే వేదిక మీదకు జగన్ తో పాటు షర్మిల రానున్నారు. దీంతో రాజకీయం ఆసక్తి పెంచుతోంది.

ఏటా వైఎస్సార్ జయంతి నాడు ఇడుపాలపాయలో ఆయనస్మారక వనం వద్ద నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కుటుంబ సభ్యులంతా ఒకేసారి ఈ కార్యక్రమానికి హాజరవుతూ వస్తున్నారు. తండ్రికి నివాళులు అర్పించేందుకు జగన్ తో పాటు షర్మిల కూడా ఆ రోజు రానున్నారు. రాజకీయంగా ఇద్దరు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎన్నికల్లో జగన్ ఓటమికి షర్మిల కారణం అన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. షర్మిల సైతం ఎన్నికల ప్రచారంలో జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. అటు జగన్ సైతం షర్మిల పేరు ఎత్తకుండా విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికల తర్వాత జగన్ పై షర్మిల రాజకీయ విమర్శలు మానుకున్నారు.

ప్రధానంగా షర్మిల జగన్ పై వైఎస్ వివేకానంద హత్య కేసు అంశంతో విరుచుకుపడేవారు. దానిని ప్రస్తావిస్తూ జగన్ ను దారుణంగా ఓడించాలని ప్రజలకు షర్మిల తో పాటు సునీత పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది. దశాబ్దాలుగా అక్కడవైయస్ కుటుంబానికి పై చేయిగా నిలుస్తూ వచ్చింది.అటువంటిదికంచుకోటలు సైతం బద్దలయ్యాయి. దీనికి వైయస్ షర్మిల కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ఆ ఇద్దరూ ఒకేసారి తండ్రికి నివాళులు అర్పిస్తారా? లేదా? అన్నది చూడాలి.