https://oktelugu.com/

Vishwak Sen: అమ్మాయిగా మారిన విశ్వక్ సేన్.. షాకింగ్ లుక్ వైరల్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫలితం పట్ల మేకర్స్ సంతృప్తి గా ఉన్నారు. కాగా నేడు విశ్వక్ సేన్ కొత్త మూవీ ప్రకటించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 3, 2024 / 02:47 PM IST

    Vishwak Sen

    Follow us on

    Vishwak Sen: విశ్వక్ సేన్ వరుస చిత్రాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాడు. 2024 ప్రథమార్థంలోనే రెండు సినిమాలు విడుదల చేశాడు. గామి చిత్రంలో అఘోరాగా నటించాడు. ఇది ఒక ఛాలెంజింగ్ రోల్. గామి చిత్రంలోని విశ్వక్ సేన్ నటనకు ప్రశంసలు దక్కాయి. అరుదైన వ్యాధితో బాధపడే అఘోర పాత్రలో మెప్పించాడు. గామి పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఇక సమ్మర్ కానుకగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం విడుదల చేశాడు. ఈ మూవీలో విశ్వక్ సేన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చెలరేగిపోయాడు.

    గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫలితం పట్ల మేకర్స్ సంతృప్తి గా ఉన్నారు. కాగా నేడు విశ్వక్ సేన్ కొత్త మూవీ ప్రకటించారు. టైటిల్ లైలా. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అనూహ్యంగా అమ్మాయి గెటప్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేశాడు. లైలా మూవీ ఫస్ట్ విపరీతమైన ఆసక్తి రేపుతోంది. లైలా మూవీలో విశ్వక్ సేన్ పాత్ర ఏమిటంటే సస్పెన్సు మొదలైంది.

    లైలా మూవీని పూజా కార్యక్రమాలతో నేను హైదరాబాద్ లో లాంచ్ చేశారు. యూనిట్ సభ్యులు, టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విశేషం ఏమిటంటే లాంచింగ్ రోజే విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. 2025 ఫిబ్రవరి 14న లవర్స్ డే కానుకగా లైలా మూవీ విడుదల కానుంది.

    విశ్వక్ సేన్ కి జంటగా ఆకాంక్ష శర్మ నటిస్తుంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలా చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ వంటి నటులు లేడీ గెటప్స్ వేశారు. ఈ జనరేషన్ లో అల్లరి నరేష్ ఒకటి రెండు చిత్రాల్లో పాక్షికంగా ట్రై చేశాడు. లేడీ గెటప్ ఛాలెంజింగ్ రోల్ కాగా విశ్వక్ సేన్ వంటి రఫ్ అండ్ టఫ్ ఫెలో ఎలా చేసి మెప్పిస్తాడో చూడాలి.