spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ నోట నాటి కెసిఆర్ మాటలు.. ఏదో తేడా కొడుతోంది

Jagan: జగన్ నోట నాటి కెసిఆర్ మాటలు.. ఏదో తేడా కొడుతోంది

Jagan: ఏడు నెలల కిందట తెలంగాణ ఎన్నికలు గుర్తున్నాయి కదూ.. నాటి ఎన్నికల్లో కేసీఆర్ ఎంతలా ధీమా వ్యక్తం చేశారో.. ఎంతలా భీరాలు పలికారో తెలియంది కాదు. అయితే తెలంగాణ ప్రజలు కేసిఆర్ కు కర్ర కాల్చి వాత పెట్టారు. అధికారం నుంచి దూరం చేశారు. అసలు సిసలు సినిమా చూపించారు రేవంత్ రెడ్డి. కెసిఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ పార్టీకి జై కొట్టాయి. బిఆర్ఎస్ శ్రేణులు భయపడిపోయాయి. అప్పుడే కెసిఆర్ ఎంట్రీ ఇచ్చారు. పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. ఫలితాలు విడుదలకు రెండు రోజుల ముందు మీడియా ముందుకు వచ్చారు. మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని ప్రకటించారు. ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. అందరూ ధైర్యంగా ఉండండి అంటూ ఓదార్పు మాటలు చెప్పారు. కానీ ఫలితాలు తారుమారయ్యాయి. అయితే ఇటువంటి మాటలే ఇప్పుడు ఏపీలో జగన్ చెబుతుండడం అందరికీ ఆశ్చర్యం వేస్తోంది.

ఏపీలో భారీగా పోలింగ్ నమోదయింది. వైసీపీ ఎత్తుగడలకు కూటమి నేతలు చెప్పగలిగారు. ప్రజలు నోటుకు కాకుండా ఓటుకు విలువనిచ్చారు. మరోవైపు సర్వేలు కూటమికి పట్టం కట్టాయి. ఫ్యాన్ రెక్కలు విరిగాయంటూ మౌత్ ప్రచారం ప్రారంభమైంది. ఇవన్నీ వైసీపీలో నైరశ్యానికి కారణమయ్యాయి. ఇటువంటి సమయంలో పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించాల్సిన జగన్.. కోట్లాది రూపాయలు ఇచ్చి పెట్టుకున్న ఐప్యాక్ టీం వద్ద విక్టరీ కొట్టబోతున్నామని ప్రకటించారు. విదేశాలకు చెక్కేశారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హింస రేగినా ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా స్పందించాల్సింది పోయి విహారయాత్రలకు వెళ్లిపోయారు. నీతో నాకు పని పూర్తయింది అన్నట్టుగా.. నీ చావు మీరు చావండి అంటూ పార్టీ క్యాడర్ను, రాష్ట్ర ప్రజలను దాడులకు వదిలేసి వెళ్లిపోయారు. అయితే జగన్ వ్యవహార శైలి చూస్తున్నవారు ఇక్కడ ఏదో తేడా కొడుతుందే అంటూ సోషల్ మీడియాలోఫలితాలకు ముందు కేసీఆర్ చేసిన కామెంట్స్ ను.. ఇప్పుడు జగన్ చెప్పిన మాటలను సరిపోల్చి పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Oktelugu Epaper
Exit mobile version