https://oktelugu.com/

KL Rahul: ఇక స్వస్తి.. జట్టులో ఉంటే అడగండి.. కేఎల్ రాహుల్

మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రాహుల్ విలేకరులతో మాట్లాడాడు.. ప్లే ఆఫ్ కు వెళ్లకపోవడం నిరాశ కలిగిస్తోందని అన్నాడు.." సీజన్ ప్రారంభంలో మా జట్టు బలంగా కనిపించింది. అన్ని విభాగాలలో సమర్థవంతంగా ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 18, 2024 11:54 am
    KL Rahul

    KL Rahul

    Follow us on

    KL Rahul: ప్లే ఆఫ్ వెళ్లాల్సిన లక్నో.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. గత వరస సీజన్ లలో ప్లే ఆఫ్ వరకు వెళ్ళిన కేఎల్ రాహుల్ సేన ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ ప్రయాణాన్ని విజయంతో ముగించింది. ముంబై ఇండియన్స్ జట్టుతో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 14 మ్యాచ్లలో ఏడింట్లో నెగ్గి, 14 పాయింట్లు సాధించింది. చెన్నై జట్టుతో సమానమైన పాయింట్లు కలిగి ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ లేని కారణంగా లీగ్ దశలోనే లక్నో నిష్క్రమించింది.

    ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. పూరన్ 75, రాహుల్ 55 పరుగులతో ఆకట్టుకున్నారు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, తుషారా చెరో మూడు వికెట్లు సాధించారు. అనంతరం చేజింగ్ ప్రారంభించిన ముంబై జట్టు 6 వికెట్లకు 196 రన్స్ మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో రోహిత్ శర్మ 68, నమన్ దీర్ 62* పరుగులు చేశారు. రవి బిష్ణోయ్, నవీన్ చెరో రెండు వికెట్లు తీశారు.

    మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రాహుల్ విలేకరులతో మాట్లాడాడు.. ప్లే ఆఫ్ కు వెళ్లకపోవడం నిరాశ కలిగిస్తోందని అన్నాడు..” సీజన్ ప్రారంభంలో మా జట్టు బలంగా కనిపించింది. అన్ని విభాగాలలో సమర్థవంతంగా ఉంది. కానీ, జట్టులో ఆటగాళ్లకు గాయాలు కావడం మమ్మల్ని దెబ్బతీసింది. అందువల్ల మేము అన్ని రంగాలలో సత్తా చూపించలేకపోయాం. ముంబై తో చేసిన ప్రదర్శన ఇంతకుముందు మ్యాచ్ లలో చూపించి ఉంటే మా భవితవ్యం వేరే విధంగా ఉండేది. జట్టులో మెరుగైన బౌలర్ల కోసం యాజమాన్యం ఎంతో ఖర్చు పెట్టింది. ఏడాది మొత్తం అదేవిధంగా ఖర్చు చేసింది. మోర్నె మోర్కెల్ దగ్గర శిక్షణ కోసం మయాంక్ యాదవ్, యుధ్ వీర్ సింగ్ ను దక్షిణాఫ్రికా పంపించింది. వాళ్లు ఏడాది మొత్తం కష్టపడ్డారు. వాళ్ళ బౌలింగ్ ఈ సీజన్లో ఆకట్టుకుంది.. నికోలస్ పూరన్ సమర్థవంతంగా ఆడాడు. ఈ సీజన్లో నా బ్యాటింగ్ ఎంతో మెరుగుపడింది. వచ్చే రోజుల్లో టి20 ఫార్మాట్ మ్యాచ్ లు అత్యంత తక్కువగా ఉన్నాయి. ఆ ఫార్మాట్లో చోటు దక్కించుకోవాలి.. ఒకవేళ అవకాశం వస్తే ఎందులో ఆడిస్తారో తెలియదు.. ఇక ప్రస్తుతం నేను టీం మారాను. మా మామ జట్టులోకి వచ్చాను. అక్కడితో కలిసి వరల్డ్ కప్ లో “శర్మా జీ కా బేటా” కు సహకారం అందిస్తానని” రాహుల్ వ్యాఖ్యానించాడు..

    అయితే రాహుల్, తన మామ సునీల్ శెట్టి, రోహిత్ శర్మతో కలిసి ఒక యాడ్ షూటింగ్లో పాల్గొన్నాడు. ఇందులో రాహుల్ ను పక్కనపెట్టి సునీల్ శెట్టి రోహిత్ శర్మకు సపోర్ట్ చేస్తాడు. దీంతో రాహుల్ నవ్వుకుంటూ ఇలా వ్యాఖ్యానించాడు. అంతేకాదు ప్రపంచ కప్ లో భారత్ గెలవాలని కోరుకున్నాడు. తాను ఇంకా టీం మార్పు గురించి రాహుల్ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. మామ టీం కు వెళ్తున్నానని చెప్పడంతో.. చాలామంది లక్నో జట్టు నుంచి రాహుల్ నిష్క్రమిస్తాడని అనుకున్నారు. ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా రాహుల్ పై మండిపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. “లక్నో జట్టుకు స్వస్తి పలుకుతాడు.. ఇక అతడు జట్టులో ఉంటే అడగండి” అని కొంతమంది క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత అది రకరకాల చర్చలకు దారి తీసింది. చివరికి రాహుల్ ను తన ఇంటికి పిలిపించుకొని సంజీవ్ గొడవకు శుభం కార్డు వేశాడు.