https://oktelugu.com/

Anil Thadani : బాహుబలి నుంచి పుష్ప సినిమా హిట్ ల వెనక ఉంది ఎవరో తెలుసా?

ఇటీవలే పుష్ప 2 నిర్మాతలు ట్రైలర్ విడుదల సందర్భంగా పాట్నా వెళ్లారు. ఇది పక్కన పెడితే కేవలం సినిమాల కోసం ఎవరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు అనే డౌట్ మీకు వచ్చిందా? ఒక సినిమాను పాన్-ఇండియా హిట్‌గా మార్చే తెర వెనుక ఉన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం.

Written By: Swathi Chilukuri, Updated On : November 19, 2024 1:05 pm
Anil Thadani

Anil Thadani

Follow us on

Anil Thadani : అల్లు అర్జున్ పుష్ప 2 రూల్ సినిమా 2024లో అత్యంత అంచనాలున్న సినిమాల్లో ఒకటి. ట్రైలర్ విడుదలతో పుష్ప 2 ఖచ్చితంగా 2024లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలుస్తుంది అంటున్నారు నెటిజన్లు. అల్లు అర్జున్ సినిమా అంటే ఆయన అభిమానులు మాత్రమే కాదు మొత్తం ప్రేక్షకులలో విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది. ఇక ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో 100 మిలియన్ మార్క్ (అన్ని భాషల్లో) చేరుకుంది. ఇటీవలే పుష్ప 2 నిర్మాతలు ట్రైలర్ విడుదల సందర్భంగా పాట్నా వెళ్లారు. ఇది పక్కన పెడితే కేవలం సినిమాల కోసం ఎవరు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు అనే డౌట్ మీకు వచ్చిందా? ఒక సినిమాను పాన్-ఇండియా హిట్‌గా మార్చే తెర వెనుక ఉన్న ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం.

ఇప్పుడు చెప్పబోయే ఆన్సర్ వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు కావచ్చు. ఎందుకంటే పుష్ప 2: ది రూల్‌ని పాన్-ఇండియా హిట్‌గా మార్చడం వెనుక ఉన్న వ్యక్తి మరెవరో కాదు అనిల్ తడానీ. ఈయన ఎవరు అనుకుంటున్నారా? చాలా మందికి ఈయన గురించి తెలిసినా కొద్ది మందికి మాత్రం ఈయన ఎవరో తెలియదు. అయితే ఓ సారి ఈ సూపర్ మ్యాన్ గురించి తెలుసుకుందాం. సౌత్ ఇండియన్ సినిమాలను పాన్-ఇండియా బ్లాక్ బస్టర్స్ గా నిలబెట్టినందుకు పూర్తి క్రెడిట్ అనిల్ కి దక్కుతుంది అంటున్నారు విశ్లేషకులు. పుష్ప: ది రైజ్, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్, KGF, KGF చాప్టర్ 2, కల్కి 2898 AD, ఇప్పుడు పుష్ప 2: ది రూల్ వంటి అనేక దక్షిణ భారతీయ చిత్రాల విజయంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు.

అయితే ఈ అనిల్ తడాని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్. అతని సంస్థ AA ఫిల్మ్స్ ఢిల్లీ, యుపి, బీహార్ వంటి ఉత్తర భారత మార్కెట్‌లలో చిత్రాల పంపిణీ, ప్రాతినిధ్యాన్ని నిర్వహిస్తుంది. తడాని 1994లో యే దిల్లగి చిత్రంతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. 2015 నుంచి అతను దక్షిణ భారత చిత్రాల హిందీ-డబ్బింగ్ వెర్షన్‌లను పంపిణీ చేస్తున్నాడు.

రెండు సౌత్ సినిమాలు బాగా ఆడలేదు:
అనిల్ తడాని మొదటి సౌత్ చిత్రం SS రాజమౌళి తెరకెక్కించిన ఐకానిక్ చిత్రం, బాహుబలి: ది బిగినింగ్. ఇది పాన్-ఇండియా హిట్‌గా మారింది. దీని తరువాత, తడాని సౌత్ చిత్రాల విజయాల కోసం నిరంతరం కృషి చేస్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ, అతని రెండు సౌత్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లు మొదట డిజాస్టర్‌గా నిలిచాయి. ప్రభాస్, కృతి సనన్ నటించిన ఆదిపురుష్, జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర – పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌ లుకా నిలిచాయి.

అనిల్ థడాని 2003లో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత నటి రవీనా టాండన్‌ను 2004లో వివాహం చేసుకున్నారు. ఉదయపూర్‌లో జరిగిన ఒక వేడుకలో ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు, ఇప్పుడు వారి వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె రాషా తడాని, కుమారుడు రణబీర్ వర్ధన్. వీరి కూతురు రాషా త్వరలో ఆజాద్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. మొత్తం మీద ఇదండి మన సౌత్ సినిమాలను పాన్ ఇండియా, వరల్డ్ లెవల్ లో సక్సెస్ కావడానికి పాత్ర పోషిస్తున్న వారిలో ఒకరి స్టోరీ.