https://oktelugu.com/

YS Vivekananda Reddy: వివేకా హత్యకు ఐదేళ్లు.. ఇన్నేళ్లలో అసలేం జరిగింది?

అసలు ఈ హత్య కేసు ఎందుకు మిస్టరీగా మారింది? ఈ చిక్కుముడిని సిబిఐ సైతం ఎందుకు విప్ప లేకపోతుంది? వివేకానంద రెడ్డి మతం మార్చుకున్నారా? కడప ఎంపీ టికెట్ ని ఆశించడం వల్లే హత్యకు గురయ్యారా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ని అనుమానాల మధ్య దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ.

Written By:
  • Dharma
  • , Updated On : March 15, 2024 / 09:22 AM IST

    YS Vivekananda Reddy

    Follow us on

    YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నేటికి ఐదేళ్లు పూర్తవుతుంది. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ కేసును అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ విచారణ చేపడుతున్నా.. ఇప్పటికీ కొలిక్కి రాలేదు. అసలైన నిందితులు పట్టుబడలేదు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సోదరుడు, ప్రస్తుత సీఎం జగన్ బాబాయ్ అయినా కేసు విచారణలో ఎటువంటి పురోగతి లేకపోవడం విశేషం. ఏళ్ల తరబడి జాప్యం జరగడంపై కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

    అసలు ఈ హత్య కేసు ఎందుకు మిస్టరీగా మారింది? ఈ చిక్కుముడిని సిబిఐ సైతం ఎందుకు విప్ప లేకపోతుంది? వివేకానంద రెడ్డి మతం మార్చుకున్నారా? కడప ఎంపీ టికెట్ ని ఆశించడం వల్లే హత్యకు గురయ్యారా? వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇన్ని అనుమానాల మధ్య దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ.. ఈ కేసులో చిక్కుముడులను విప్పలేక పోతుందంటే ఆశ్చర్యం వేస్తోంది. గత ఐదేళ్లుగా ఈ కేసు విచారణ మూడు అడుగుల ముందుకు వెళితే.. ఆరడుగులు వెనక్కి పడ్డ చందంగా మారింది.

    వాస్తవానికి వివేకా హత్యపై ఆయన కుమార్తె సునీత గట్టిగా పోరాడుతున్నారు. అందుకే ఈ కేసు సజీవంగా ఉందని.. లేకుంటే ఏనాడో నీరు గారి పోయేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె గట్టిగా నిలబడడం వల్లే గుండెపోటు కాస్త గొడ్డలిపోటుగా తేలింది. అత్యంత భయానకమైన రీతిలో ఉన్న క్రైమ్ సీన్లు చూసి కూడా గుండెపోటు అని ఎందుకు చిత్రీకరించారో తెలియడం లేదు. కేసులో ఇదే కీలకంగా మారింది. విపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు కోరిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదని తేల్చేశారు. చివరకు కుమార్తె సునీత గట్టిగా నిలదీయడం, న్యాయపోరాటం చేయడంతో సిబిఐ దర్యాప్తునకు మార్గం సుగమయింది. అయితే విచారణ మాత్రం మందకొడిగా సాగుతోంది. సంవత్సరాలు గడుస్తున్నా ఈ డెత్ మిస్టరీ మాత్రం వీడడం లేదు. ఐదేళ్లు అంటే చిన్న విషయం కూడా కాదు. ఆయన ఒక సాధారణ వ్యక్తి కూడా కాదు. మాజీ ఎంపీ ఆపై మాజీమంత్రి, అన్నింటికీ మించి ఓ మాజీ సీఎం సోదరుడు, ప్రస్తుత సీఎం బాబాయ్. అటువంటి వ్యక్తి హత్యకు గురైతే నిందితులను పట్టుకోలేని స్థితిలో యంత్రాంగం ఉంది. మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటన్నది ఊహించుకోవచ్చు. వివేకానంద రెడ్డి హత్య గత ఎన్నికల్లో జగన్ కు సానుభూతిగా వర్కౌట్ అయ్యింది. ఈ ఎన్నికల్లో మాత్రం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.