https://oktelugu.com/

Razakar Review: రజాకార్ ఫుల్ మూవీ రివ్యూ…

నిజాం సంస్థానం లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనే విషయాలను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయడానికి ' రజాకార్' అనే సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : March 15, 2024 / 09:07 AM IST

    Razakar Review

    Follow us on

    Razakar Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డిఫరెంట్ కథలతో సినిమాలు వస్తున్నాయి. అలాగే ఆ సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తూ మంచి విజయాలుగా మారుస్తున్నారు. గత వారం లో విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గామి సినిమా ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఈ వారం కూడా తెలంగాణ ప్రాంతం నిజాం సంస్థానం లో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అనే విషయాలను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయడానికి ‘ రజాకార్’ అనే సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాన్ని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    భారతదేశం మొత్తానికి 1947 వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. అయితే హైదరాబాదుకు మాత్రం 1948వ సంవత్సరంలో రావడం విశేషం.. భారతదేశం అంతా బ్రిటిష్ వారి సంస్థానంలో నలిగిపోతున్నప్పుడు తెలంగాణ ప్రాంతం, కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు నిజాం అధికారుల చేతిలో బందీలుగా ఉండేవి.1947 లో బ్రిటిష్ వారు స్వాతంత్ర్యాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్న క్రమంలో నిజాం పాలన లో ఉన్న ప్రాంతాలను వాళ్ళ ఇష్టం వచ్చిన ప్రాంతాల్లో కలుపుకోవచ్చు అనే ఒక స్వేచ్ఛని వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయారు. దాంతో అప్పటి నిజాం రాజు (మకరంద్ దేశ్ పాండే) కి ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ లో కలపడం ఇష్టం లేదు. అలాగని ఇండియాలోనూ కలవడం నచ్చలేదు.ఈ ప్రాంతాన్ని సపరేట్ గా రజాకారులని ప్రైవేట్ సైన్యం గా పెట్టుకొని ‘తుర్కిస్తాన్ ‘ అనే ప్రాంతంగా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. ఇక దానికి అనుకూలంగానే ఈ ప్రాంతంలో ప్రజలు బ్రతకాలంటే మతాలు మారాల్సిందేనని జనాల్ని విపరీతంగా ఇబ్బందులు పెడుతూ,వాళ్ల హక్కులను కాలారాస్తూ జనాల మీద అరాచకాలను కొనసాగించారు.

    బిడ్డ పుట్టిన పన్ను, చనిపోయిన పన్ను కట్టాలని విపరీతమైన ఇబ్బందులకు గురి చేయడం తో విసిగిపోయిన జనం రజాకార్ల పై తిరుగుబాటు చేసిన పోరాట యోధులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రజాకార్ల పైన తెలంగాణ ప్రజలు ఎలాంటి విజయాన్ని సాధించారు. ఇక అందులో భాగంగానే అప్పటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంతాన్ని ఇండియాలో ఎలా కలిపారు అనే కథాంశ్యం తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది…

    విశ్లేషణ

    ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో దర్శకుడు యాట సత్యనారాయణ తీసుకున్న పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఒకప్పుడు తెలంగాణ నిజాం సంస్థానం ఆధీనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వాటిని ఇప్పటి జనానికి చూపించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన ఈ సినిమా తీసినట్టుగా కనిపిస్తుంది. ఈ పోరాటం అందరూ పుస్తకాల్లో చదివినట్టుగానే దానికి దృశ్య రూపాన్ని ఇస్తూ మన కళ్లకు కట్టినట్టుగా చూపించడంలో డైరెక్టర్ సత్యనారాయణ 100% సక్సెస్ అయ్యాడు. ప్రతి సీన్ లో తెలంగాణ ప్రజలు ఎలాంటి అరాచకానికి గురయ్యారు. ముఖ్యంగా నిజాం రాజు చేసే అరాచకాలను చూస్తుంటే సినిమా చూసే జనానికి సైతం వాళ్ల మీద విపరీతమైన కోపం వస్తుంది. అలాంటి ఒక ఇంటెన్స్ డ్రామా ని ఈ సినిమా చూసే ప్రేక్షకుల్లో క్రియేట్ చేయడంలో డైరెక్టర్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే ఈ సినిమాని తీయాలంటే దర్శకుడికి ఘట్స్ ఉండాలి. కానీ డైరెక్టర్ సత్యనారాయణ ఎక్కడ కూడా చిన్నపాటి తడబాటు కూడా లేకుండా చాలా గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. సీరియల్ డైరెక్టర్ అయిన కూడా చాలా గ్రాండ్ గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడనే చెప్పాలి.

    ఆయన తీసిన ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఆయనకి మంచి గౌరవం దక్కుతుందనే చెప్పాలి. ఇక డైరెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫామెన్స్ రాబట్టుకోవడం లో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. నిజానికి ఈ సినిమాకి ఎంతైతే బడ్జెట్ కావాలో, అంత బడ్జెట్ ని ప్రొడ్యూసర్ గూడూరు నారాయణరెడ్డి గారు సమకూర్చడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాని తీయడం వీలు కాదని చాలా ఎక్కువ బడ్జెట్ ను ఇచ్చి డైరెక్టర్ కి ఫ్రీ హాండ్స్ ఇచ్చి అతని చేత ఈ సినిమా తీయించడం అనేది నిజంగా గొప్ప విషయనే చెప్పాలి… ఇక ఈ సినిమాకి కొన్ని సీన్లల్లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా హైలైట్ గా నిలిచింది. సాంగ్స్ కూడా పర్లేదు అనిపించేలా చూస్తున్నంత సేపు సినిమాలో లీనమయ్యేలా చేశాయి. ముఖ్యంగా మధ్య మధ్య లో వచ్చే కొన్ని సీన్లు గూస్ బమ్స్ తెప్పించాయనే చెప్పాలి…ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన బీమ్స్ మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడనే చెప్పాలి…ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఆర్ట్ డైరెక్టర్ గురించి మనం ఎక్కువగా చెప్పాలి. ఈ సినిమాలో ఒకప్పటి మ్యాజిక్ ని రీ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు.

    వాళ్ళు వేసుకున్న బట్టలు గాని, మనకు కనిపించే ప్రాంతాలు గాని, ప్రతి దాంట్లో 1940 నాటి చరిత్రను చూపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక రమేష్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా హైలైట్ గా నిలిచింది. ప్రతి సీన్ ను అద్భుతంగా చూపించడమే కాకుండా ఆయన అందించిన విజువల్స్ వల్లే సినిమా అనేది టాప్ నాచ్ లో ఉందనే చెప్పాలి. ఇక ఎడిటర్ తమ్మి రాజు ఈ సినిమా లెంత్ ఎంత ఉండాలో సరిగ్గా అంతలోనే కట్ చేసి సినిమా బోరింగ్ గా లేకుండా చేయడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో కనిపించిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అద్భుతంగా నటించారనే చెప్పాలి. ముఖ్యంగా నిజాం రాజు గా చేసిన మకరంద్ దేశ్ పాండే చేసిన నటన తన కెరీయర్ లో ఇంత వరకు ఆయన ఎప్పుడు చేసి ఉండకపోవచ్చు. బాబీ సింహ, ఇంద్రజ, రాజ్ అర్జున్, అనసూయ లాంటి ప్రతి ఒక్క నటినటులు వాళ్ల పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. ఒక్కొక్క పాత్రలో ఒదిగిపోయి నటించడమే కాకుండా వాళ్లకంటూ ఒక స్పెషలైజేషన్ ని కూడా క్రియేట్ చేసుకున్నారు. నిజానికి ఇంద్రజ గారు పోషించిన చాకలి ఐలమ్మ పాత్ర మాత్రం సినిమాకి హైలెట్ గా నిలిచిందనే చెప్పాలి…

    టెక్నికల్ అంశాలు

    టెక్నికల్ అంశాల విషయానికి వస్తే
    ఈ సినిమాలో బీమ్స్ మ్యూజిక్ సినిమాలో ఉన్న కొన్ని సీన్లని హైలెట్ గా చూపించడానికి చాలా వరకు ప్లస్ అయింది. అలాగే రమేష్ రెడ్డి విజువల్స్ అయితే కొన్ని సీన్లు హైలెట్ గా నిలిపాయనే చెప్పాలి. కొన్ని ఎమోషన్స్ సీన్స్ లో ఆయన అందించిన విజువల్స్ అయితే సూపర్ గా ఉన్నాయని చెప్పాలి. ఇక టెక్నికల్ గా ఈ సినిమా అయితే చాలా స్ట్రాంగ్ గా కనిపించింది. ఎమోషనల్ గా కూడా ఈ సినిమాని డైరెక్టర్ నడిపించిన విధానం చాలా బాగుంది…ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి…

    ప్లస్ పాయింట్స్

    కథ
    డైరెక్షన్
    కొన్ని గూస్ బమ్స్ ఎపిసోడ్స్

    మైనస్ పాయింట్స్

    కొన్ని సీన్లు మెలో డ్రామా గా ఉన్నాయి. అవి ప్రేక్షకుడికి కొంత బోర్ కొట్టించవచ్చు…

    రేటింగ్
    ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

    చివరి లైన్
    తిరుగుబాటు భావజాలం తో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలి… కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమా చూస్తాం అనుకునేవాళ్లు ఈ సినిమాకు దూరం గా ఉంటే మంచిది…