బాబు వెంట ఉన్నది ఎంతమంది?

టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ ఎదుర్కొని గడ్డు పరిస్థితులను ఆ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. కిందటి ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ముందు టీడీపీ బొక్కబొర్లాపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న క్యాలిక్యులేషన్స్ ఏవీ కూడా ఆయనకు కలిసిరాలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మి ఎన్డీఏ కూటమి వీడి యూపీఏ పక్షాన చేరారు. అయితే కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. గతంలోనూ టీడీపీ ప్రతిపక్ష పాత్రను పోషించినప్పటికీ ప్రస్తుతం టీడీపీ […]

Written By: NARESH, Updated On : September 3, 2020 4:58 pm
Follow us on

టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ ఎదుర్కొని గడ్డు పరిస్థితులను ఆ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటోంది. కిందటి ఎన్నికల్లో జగన్ ప్రభంజనం ముందు టీడీపీ బొక్కబొర్లాపడింది. టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న క్యాలిక్యులేషన్స్ ఏవీ కూడా ఆయనకు కలిసిరాలేదు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మి ఎన్డీఏ కూటమి వీడి యూపీఏ పక్షాన చేరారు. అయితే కేంద్రంలో బీజేపీ.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీకి గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది.

గతంలోనూ టీడీపీ ప్రతిపక్ష పాత్రను పోషించినప్పటికీ ప్రస్తుతం టీడీపీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్నట్లు కన్పిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా 20ఏళ్ల నాటి రాజకీయాలే చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. ఇక చంద్రబాబు నాయుడు తనయుడు సైతం పార్టీని ముందుండి నడిపించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఆయన క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవడం కేవలం ట్వీట్స్ కే పరిమితం అవుతుండటంతో ఆ పార్టీ నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు.

కిందటి ఎన్నికల్లో టీడీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు జగన్ కు జై కొట్టారు. దీనికితోడు అమరావతి రాజధాని విషయంలోనూ చంద్రబాబు తీరుతో ఇతర ప్రాంతాల్లోని టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. తమ భవిష్యత్ గురించి ఆలోచించుకొని ముందస్తుగానే దుకాణాన్ని సర్దేసుకుంటుండటంతో టీడీపీ ఆయా జిల్లాల్లో ఖాళీ అవుతోంది.

చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబులు ప్రజా సమస్యలపై పోరాడకుండా కేవలం జగన్ పై ఆరోపణలకే సమయం కేటాయిస్తున్నారు. గతంలో వైసీపీ చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేసిందో అవే ఆరోపణలను జగన్ పై చంద్రబాబు చేస్తున్నారు. నాడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు.. ప్రస్తుతం జగన్ తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వంపై విమర్శలు వచ్చిన వెంటనే జగన్ తక్షణమే చర్యలు తీసుకుంటుండటంతో చంద్రబాబు కంటే జగనే బెటారన్ అనే టాక్ ప్రజల నుంచి విన్పిస్తోంది.

దీంతో టీడీపీలో గెలిచిన నేతలతోపాటు, ఓడిన నేతలు వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో టీడీపీలో పెద్దఎత్తున వలసలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆపార్టీలో ఎంతమంది ఉన్నారనే లెక్క టీడీపీ అధినేతక దొరకడం లేదట. ఇది ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో టీడీపీ కనుమరుగు అవడం ఖాయమనే ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఇకనైనా పాతచింతకాయ పచ్చడిలాంటి రాజకీయాలు మాని ప్రజా సమస్యలపై పోరాడాలని పలువురు సూచిస్తున్నారు.