ఐపీఎల్-2020పై నీలినీడలు.. క్రికెటర్లలో భయాందోళన

ఐపీఎల్-2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఐపీఎల్ కు చెందిన చెన్నై జట్టులోని 13మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఐపీఎల్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు కంగారు పడుతున్నారు. అయితే బీసీసీఐ క్రికెటర్ల భద్రతా కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా పలువురు కరోనా బారిన పడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చెన్నై జట్టు సభ్యులు క్రికెటర్లు కరోనా బారినపడటానికి బుబుల్స్ కారణమని ప్రచారం జరుగుతోంది. క్రికెటర్లంతా ఆటకు ముందుగా బయో సెక్యూర్ లో కొంతకాలం ఉండాల్సి […]

Written By: NARESH, Updated On : September 3, 2020 4:36 pm
Follow us on


ఐపీఎల్-2020 నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఐపీఎల్ కు చెందిన చెన్నై జట్టులోని 13మంది కరోనా వైరస్ బారినపడ్డారు. దీంతో ఐపీఎల్ లో ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు కంగారు పడుతున్నారు. అయితే బీసీసీఐ క్రికెటర్ల భద్రతా కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా పలువురు కరోనా బారిన పడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

చెన్నై జట్టు సభ్యులు క్రికెటర్లు కరోనా బారినపడటానికి బుబుల్స్ కారణమని ప్రచారం జరుగుతోంది. క్రికెటర్లంతా ఆటకు ముందుగా బయో సెక్యూర్ లో కొంతకాలం ఉండాల్సి ఉంటుంది. ఇటీవల విజెన్డ్ టెస్టు కోసం కూడా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు టెస్టు సీరిస్ కోసం సుమారు 70రోజులు బయో సెక్యూర్ బబుల్ లో ఉన్నాయి. వీరితోపాటు మాంచెస్టర్, సౌతాంప్టన్ ల్లోనూ క్రికెటర్లు బయో బబుల్ ఉన్నారు. అప్పుడు ఎలాంటి కరోనా కేసు కూడా నమోదు కాలేదు.

అయితే తాజాగా ఐపీఎల్ బయో బబుల్ ఉన్న చెన్నై క్రికెటర్లకు కరోనా సోకడంతో ఆందోళన రేకెత్తిస్తోంది. 13మంది కరోనా బారిన పడటంతో ఐపీఎల్లో ఆడేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్లు కంగారు పడుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ నుంచి రైనా, మలింగలు అవుట్ అయ్యారు. వీరిద్దరు కూడా ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ గా రాణించారు. ప్రస్తుతం వీరిద్దరు ఐపీఎల్ కు దూరం కావడంతో ఐపీఎల్ కళతప్పే అవకాశం కన్పిస్తోంది. అంతేకాకుండా పలువురు ఐపీఎల్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐపీఎల్-2020ను బీసీసీఐ ఎలా నిర్వహిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.