ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం.. ప్రముఖ హీరోయిన్ కు నోటీసులు
ఇటీవలీ కాలంలో సినిమా ఇండస్ట్రీకి.. డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ డ్రగ్ రాకెట్ లింకులు బాలీవుడ్, టాలీవుడ్, మల్లువుడ్, సాండల్ వుడ్ ను తాకాయి. గతంలోనూ పలు ఇండస్ట్రీలో డ్రగ్ సంబంధం ఉన్న సెలబ్రెటీలు అరెస్టయి జైళ్లకు వెళ్లిన సంఘటనలు ఉన్నారు. తాజాగా మరోసారి డ్రగ్ రాకెట్ సాండల్ వుడ్లో కలకలం రేపుతోంది. ఇటీవల బయటపడిన డ్రగ్ స్కాండర్ లతో సాండల్ వుడ్ కు లింకున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. సాండల్ […]
Written By:
, Updated On : September 3, 2020 / 05:07 PM IST
ఇటీవలీ కాలంలో సినిమా ఇండస్ట్రీకి.. డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ డ్రగ్ రాకెట్ లింకులు బాలీవుడ్, టాలీవుడ్, మల్లువుడ్, సాండల్ వుడ్ ను తాకాయి. గతంలోనూ పలు ఇండస్ట్రీలో డ్రగ్ సంబంధం ఉన్న సెలబ్రెటీలు అరెస్టయి జైళ్లకు వెళ్లిన సంఘటనలు ఉన్నారు. తాజాగా మరోసారి డ్రగ్ రాకెట్ సాండల్ వుడ్లో కలకలం రేపుతోంది.
ఇటీవల బయటపడిన డ్రగ్ స్కాండర్ లతో సాండల్ వుడ్ కు లింకున్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. సాండల్ వుడ్లో ముందుగా దర్శకుడు ఇంద్రజిత్ పేరు ప్రముఖంగా విన్పించింది. అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించడంతో మరికొందరు పేర్లు బయటికి వస్తున్నాయి. వీరిలో పలువురు స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సాండల్ వుడ్లో కలకలం మొదలైంది.
వీరందరికీ ఇప్పటికే సీసీఎస్ పోలీసులు నోటీసులు పంపించి విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు సమాచారం. సాండల్ వుడ్లో బయటపడిన డ్రగ్ రాకెట్ తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ రాగిని ద్వివేదిని నేడు సీసీఎస్ పోలీసులు ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు. ఆమెతోపాటు మరికొందరిని కూడా త్వరలోనే పోలీసులు విచారించనున్నారు.
ఈనేపథ్యంలోనే ఈ డ్రగ్ రాకెట్ తో ఎవరెవరికీ సంబంధాలు ఉన్నాయనేవి బయటికి రానున్నాయి. ఇండస్ట్రీలోని ప్రముఖుల పేర్లు బయటికి వస్తుండటంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది.గతంలోనూ బాలీవుడ్, టాలీవుడ్లో డ్రగ్ మాఫియాతో సంబంధంలు బయటపడగా పోలీసులు కొన్నిరోజులు హడావుడి చేసి అర్థాంతరంగా ముగించారు. దీంతో ఈ కేసు కూడా ఇలానే అవుతుందననే అనుమానాలు రేకెత్తుత్తోన్నాయి. ప్రముఖుల పేర్లు బయటికి వస్తుండటంతో ఈ కేసు మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే..!