https://oktelugu.com/

Amit Shah- GVL : అనువాదంలో సైతం ఇంతలేకితనమేంటి జీవీఎల్?

ఇప్పుడు ఏకంగా అమిత్ షా వంటి నేత ఏపీ వచ్చి జగన్ సర్కారును విమర్శిస్తుంటే సరిగ్గా తర్జుమా చేయలేదు. అటు అమిత్ షా మాటలను, ఇటు జీవీఎల్ తర్జుమాను  సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు వైరల్ చేశారు. బీజేపీ నేతలు కూడా దీన్ని సమర్థించుకోలేకపోయారు.చివరికి జీవీఎల్ ను సొంత పార్టీ నేతలే అనుమానపు చూపులు ప్రారంభించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 12, 2023 / 02:26 PM IST
    Follow us on

    Amit Shah- GVL : అప్పుడెప్పుడో వచ్చిన నువ్వు నేను సినిమాలో ఓ కామెడీ సీన్ కడుపుబ్బా నవ్విస్తుంది గుర్తుంది కదూ. కాలేజీ ఫంక్షన్ లో కమేడియన్ ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇంగ్లీష్ ను తెలుగులోకి అనువదించినప్పుడు చేసే పద ప్రయోగం నవ్వు తెప్పిస్తోంది. ప్రిన్సిపాల్ హోదాలో ఎంఎస్ నారాయణ ఇంగ్లీష్ మాటలను ధర్మవరపు అనువదించిన తీరు ఆకట్టుకుంటుంది. ఇప్పుడు సేమ్ విశాఖలో అనువంటి తర్జుమా ఒకటి వెలుగులోకి వచ్చింది. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హింది ప్రచారాన్ని తెలుగులో తర్జుమా చేసి ఎంపీ జీవిఎల్ నరసింహరావు అడ్డంగా బుక్కయ్యారు. తన సొంత కవిత్వాన్ని జతచేసి ఇట్టే దొరికిపోయారు. అపర మేధావి అయిన అమిత్ షా తప్పిదాన్ని గ్రహించేసరికి  జీవీఎల్ ఓకింత ఆశ్చర్యానికి గురయ్యారు. సిగ్గుతో తలదించుకున్నారు.

    రెండురోజుల పర్యటనకు అమిత్ షా విశాఖ వచ్చిన సంగతి తెలిసిందే. స్థానిక రైల్వే గ్రౌండ్ లో మీటింగ్ సైతం ఏర్పాటుచేశారు. అమిత్ షాకు ట్రాన్స్ లేటర్ గా ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యవహరించారు. బాగా అనువాదం చేసి అమిత్ షా దగ్గర మార్కులు కొట్టేయాల్సిన జీవీఎల్… తన అభిమాన నేత, ప్రభుత్వాన్ని అమిత్ షా విమర్శిస్తున్నారని.. సొంత కవిత్వం చెప్పి ప్రజల్ని నమ్మించాలని అనుకున్నారు. తీరా చూస్తే.. ఆయన ట్రాన్స్ లేట్ చేస్తున్న తీరుపై అమిత్ షాకే డౌట్ వచ్చింది. నేరుగానే అడిగేశారు. తాను ఏం చెబుతున్నాను.. నువేం చెబుతున్నావని స్టేజీపైనే నిలదీశారు. దీంతో ఉలిక్కిపడిన జీవీఎల్ నరసింహారావు.. వినిపించడం లేదు.. రాసుకుంటానని కవర్ చేసుకుని తప్పించుకున్నారు.

    వాస్తవానికి బీజేపీలో జీవీఎల్ నరసింహరావు అనే నేత ఒకరున్నారని చాలా వరకూ తెలియదు. కానీ గత ఎన్నికల ముందు ఆయన ఫేమ్ లోకి వచ్చారు. టీడీపీ నుంచి బీజేపీని దూరం చేసి.. జగన్ ను దగ్గర చేయడంలో జీవీఎల్ దే కీలక పాత్ర అని అప్పట్లో ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి నడిచింది. గత కొన్నిరోజులుగా బీజేపీకి దగ్గర కావాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు జీవీఎల్  అడ్డంకిగా నిలుస్తున్నారని ఒక అపవాదు ఉంది. ఇప్పుడు ఏకంగా అమిత్ షా వంటి నేత ఏపీ వచ్చి జగన్ సర్కారును విమర్శిస్తుంటే సరిగ్గా తర్జుమా చేయలేదు. అటు అమిత్ షా మాటలను, ఇటు జీవీఎల్ తర్జుమాను  సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు వైరల్ చేశారు. బీజేపీ నేతలు కూడా దీన్ని సమర్థించుకోలేకపోయారు.చివరికి జీవీఎల్ ను సొంత పార్టీ నేతలే అనుమానపు చూపులు ప్రారంభించారు.

    వాస్తవానికి సెఫాలజిస్టుగా జీవీఎల్ బీజేపీ పెద్దలకు దగ్గరయ్యారు.  రాజ్యసభ సభ్యత్వంతో పాటు అధికార ప్రతినిధి పదవినికూడా పొందారు. అయితే ఏపీ బీజేపీలోఆయన పవర్ సెంటర్ గా మారిపోయారన్న ప్రచారం ఉంది. జగన్ సర్కారుకు, వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్న అపవాదు ఉంది. అందుకే ఆయన  అధికార పదవి నుంచి పీకేశారు. రేపు యూపీ నుంచి ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వం పదవీ కాలం కూడా ముగిసిపోతుంది. ఆయనకు ఇక ప్రాధాన్యం దక్కదని… కంటిన్యూ చేయరని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. అందుకే ఆయన విశాఖ పార్లమెంటరీ స్థానం పై ఫోకస్ చేస్తున్నారన్న ప్రచారం ఉంది. అయినా  తన లేకితనంతో ఆ చాన్స్ దక్కదన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఏకంగా జగన్ ప్రయోజనాల కోసం విమర్శల తీవ్రత తగ్గించారంటే అంతకంటే అన్యాయం మరోకటి ఉండదు.