Pushpa 2 Interval Twist: ‘పుష్ప : ది రూల్’ ఇంటర్వెల్ ట్విస్ట్ కి ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యిపోతాది..సుకుమార్ తెలివి మామూలుది కాదు!

ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అయితే పుష్ప సినిమా అంటే వెర్రిక్కిపోతారు. సుకుమార్ టేకింగ్ మరియు అల్లు అర్జున్ క్యారక్టర్ వాళ్లకు తెగ నచ్చేసింది.నార్త్ లో అల్లు అర్జున్ కి స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది

Written By: Vicky, Updated On : June 12, 2023 1:37 pm

Pushpa 2 Interval Twist

Follow us on

Pushpa 2 Interval Twist: ఇండియన్ మూవీ లవర్స్ మొత్తం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రం. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన పుష్ప సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపేసింది. తెలుగులో కంటే కూడా ఇతర భాషల్లోనే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది.

ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ అయితే పుష్ప సినిమా అంటే వెర్రిక్కిపోతారు. సుకుమార్ టేకింగ్ మరియు అల్లు అర్జున్ క్యారక్టర్ వాళ్లకు తెగ నచ్చేసింది.నార్త్ లో అల్లు అర్జున్ కి స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నాం అంటే కచ్చితంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారు. ఇప్పుడు ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ విషయం లో అదే జరుగుతుంది.

ఇది ఇలా ఉండగా సుకుమార్ తన ప్రతీ సినిమాలోనూ అదిరిపోయే రేంజ్ ట్విస్ట్ పెట్టడం కామన్. ఎలాంటి ట్విస్టులు అంటే థియేటర్స్ లో చూస్తున్న ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యి బుర్ర బయటకి వచ్చేసే రేంజ్ ట్విస్టులు అన్నమాట. ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం అల్లు అర్జున్ చనిపోయినట్టుగా, కానీ జనాలు ఆయన బ్రతికి ఉన్నాడని విశ్వసిస్తున్నట్టుగా చూపిస్తాడట. ఇంటర్వెల్ లో అల్లు అర్జున్ పాత్ర మిస్టరీ ని అద్భుతమైన ట్విస్టుతో ఒక యాక్షన్ బ్లాక్ ద్వారా రెవీల్ చేస్తారని.

ఈ ఇంటర్వెల్ బ్లాక్ మొత్తం సినిమాకి పెద్ద హైలైట్ కాబోతుందని, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఇలాంటి ఇంటర్వెల్ ఇప్పటి వరకు ఆడియన్స్ చూసి ఉండరని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.