Homeఆంధ్రప్రదేశ్‌AP Hikes Electricity Charges : తెలంగాణలో లేని క‘రెంట్’.. ఏపీలో ఎందుకో?

AP Hikes Electricity Charges : తెలంగాణలో లేని క‘రెంట్’.. ఏపీలో ఎందుకో?

AP Hikes Electricity Charges : ఏపీలో వినియోగించిన విద్యుత్ కంటే…ఆరేడు రూపాల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు.రూపాయి విద్యుత్ ను వినియోగిస్తే పది రూపాయలు బాదేస్తున్నారు. ఈ బాదుడు విషయంలో ఏ వర్గానికీ మినహాయింపు లేదు. పేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా… అందరినీ సమానంగా బాదేస్తున్నారు. రోజంతా కరెంటు ఇస్తున్నామని గొప్పలకు పోతూ… ఆ భారమంతా జనంపైనే వేస్తున్నారు.  సర్దుబాటు చార్జీలకు తోడు ఇంధన సర్‌చార్జీ, కన్జ్యూమర్‌ చార్జీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఇలా రకరకాల పేర్లతో సగటు వినియోగదారుడికి షాకిస్తున్నారు. కరెంటు వాడకం చార్జీలకు సమానంగా ఇతర చార్జీలు కనిపిస్తున్నాయి.

డిస్కంలను దోపిడీ కేంద్రాలుగా మార్చేశారు. సర్ ప్లస్ విద్యుత్ ఉత్పత్తిలో ఉన్న రాష్ట్రాన్ని అడ్డగోలు విధానాలతో అస్తవ్యస్తం చేశారు.  ఒక్క యూనిట్ కరెంట్ ఇవ్వని హిందూజాకు 1250 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. బినామీ కంపెనీ అయిన షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ నుంచి వేల కోట్ల విలువైన ట్రాన్స్ ఫార్మర్లు అవసరం లేకపోయినా కొనిపడేశారు. ఇవన్నీ ప్రజలమీదే రుద్దారు.ఇప్పటివరకూ అధికారికంగా కరెంట్ చార్జీలు ఎన్ని సార్లు పెంచారో లెక్కే లేదు. అయితే ప్రభుత్వం చేసిన అవినీతి .. డిస్కంలను దోచుకున్న దానికీ.. ప్రజల దగ్గర బాదేస్తూండటమే అసలు విషాదం

దయాది రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం లేదు. కనీసం అక్కడ ఫిర్యాదులు సైతం లేవు. అన్నివర్గాల వారికి ఉపశమనం కలిగేలా బిల్లులు వస్తున్నాయి. ఎక్కడా ఎటువంటి తారతమ్యం లేదు. ప్రజలపై భారం పెద్దగా కనిపించడం లేదు.  కానీ ఏపీలో కరెంట్ బిల్లును చూస్తే.. అసలు కన్నా కొసరు ఎక్కవన్నట్లుగా బిల్లు కన్నా ఇతర చార్జీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ట్రూ ఆప్ , ఒకటో ఎఫ్‌పీపీసీఏ, రెండో ఎఫ్‌పీసీసీఏ, కస్టమర్ చార్జీలు , ఫిక్సుడ్ చార్జీలు ఇలా కనీసం ఆరేడు రకాల వడ్డింపులతో బిల్లును షాక్ కొట్టిస్తున్నారు. సామాన్యులకు అందనంత దూరంలో, బిల్లులు కట్టలేనంతగా పెంచేసి తెగ బాదేస్తున్నారు.

ఎక్కడా లేని ఈ చార్జీలేంటి? అంటే మాత్రం ప్రభుత్వం నుంచి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.  బహిరంగ మార్కెట్ నుంచి కరెంట్ కొన్నాం.. ఎక్కువ ఖర్చు అయ్యిందని చెబుతూ వస్తోంది.  తెలంగాణ ప్రభుత్వం కూడా బయట నుంచే భారీగా కొంటుంది. అలా కొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. కానీ అక్కడ ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలు ప్రజలపై భారం మోపలేదు. ఇంధన సర్దుబాటు చేయలేదు. ఇతర అడ్డగోలు చార్జీలేమీ వేయలేదు. వాడుకున్నదానికి మాత్రమే బిల్లు వేస్తున్నారు. ఏపీలో ఇంత దారుణంగా విద్యుత్ వినియోగదారుల్ని దోపిడీ చేస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. దీనికి తోడు స్మార్ట్ ఫోన్లు రైతుల మెడకు బిగుస్తున్నారు. ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారు. నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version