Duvvada Madhuri: ఏపీలో( Andhra Pradesh) పాపులర్ జంట ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. సినీ సెలబ్రిటీస్ కి మించి విపరీతమైన పాపులారిటీ సాధించింది ఈ జంట. ఈ జంట కోసం మీడియా సైతం పరితపిస్తోంది. ఒకవైపు వ్యాపార విస్తరణలో ఉన్న ఈ జంట.. అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూలో కనిపిస్తోంది. జనాలకు వినోదం పంచుతోంది. టీవీ ఛానల్ లకు టీఆర్పి రేట్లు పెంచుతోంది. అందుకే వీరిని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఛానళ్లు సైతం క్యూ కడుతున్నాయి. మొన్న ఆ మధ్యన రిపీటేటెడ్ న్యూస్ ఛానల్ సైతం ఈ జంటను ఇంటర్వ్యూ చేసేందుకు విలువైన సమయాన్ని కేటాయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read: రోజాకు షాక్.. రూ.400 కోట్లపై విచారణ ప్రారంభం!
* ఒంటరిగా వచ్చి హల్ చల్..
అయితే తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో( interview) మాట్లాడారు దివ్వెల మాధురి( Madhuri). ముందుగా ఒంటరిగా వచ్చారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ రాకపోవడానికి సంబంధిత హోస్ట్ ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాసుతో విభేదాలు వచ్చాయి అంటూ ఆరోపణలు వస్తున్నాయని.. అందుకే దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas ) రాలేదా అంటూ ప్రశ్నించారు. అయితే వెను వెంటనే తన సెల్ ఫోన్ తీసుకొని దువ్వాడ శ్రీనివాస్ కు ఫోన్ చేశారు మాధురి. ఎక్కడ ఉన్నారంటూ అడిగేసరికి.. సిటీలో ఉన్నానని చెప్పుకొచ్చారు. వెంటనే అక్కడకు రావాలా అంటూ ప్రశ్నించారు. అక్కడకు కొద్దిసేపటికే ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను సైతం వెల్లడించారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.
* ఆ ఆరోపణల్లో నిజం లేదు
తమ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) తమను పక్కన పెట్టారన్న ఆరోపణల్లో అస్సలు నిజం లేదన్నారు దువ్వాడ. తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి తమ వ్యక్తిగత జీవితం అని చెప్పుకున్నారే తప్ప.. ఎప్పుడు కలుగజేసుకున్న దాఖలాలు లేవని కూడా తేల్చి చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. అదే సమయంలో మాధురి తన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టారు. త్వరలో తాను సినిమాల్లోకి రాబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. కే జి ఎఫ్ తరహాలో సినిమా చేస్తానని కూడా తేల్చేశారు. దువ్వాడ శ్రీనివాస్ రాక మునుపే.. తన నటన కౌశల్యంతో మెప్పించారు. అటు ఇటుగా వాక్ చేస్తూ అలరించారు. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అంటూ తెగేసి చెప్పారు.