OG Movie: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకునం చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘ఓజీ'(They Call Him OG) నే. ఈ సినిమా కోసం ఆయన అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు, టాలీవుడ్ ట్రేడ్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా పూర్తి అవ్వడానికి పవన్ కళ్యాణ్ నుండి కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే అవసరం ఉంది. ఏప్రిల్ నెల నుండి ఆయన డేట్స్ కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. మే లేదా జూన్ లోపు ప్యాచ్ వర్క్ తో సహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసి సెప్టెంబర్ 25న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మంగళగిరి సమీపం లో భారీ సెట్స్ ని కూడా నిర్మిస్తూ ఉన్నారట.
ALso Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
ఇదంతా పక్కన పెడితే అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. సీక్వెల్ కి సంబంధించి ఇది వరకే కాకినాడ పోర్ట్ లో పలు కీలక సన్నివేశాలను షూట్ చేశారట. పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఈ సినిమాకు డేట్స్ కేటాయిస్తానని, ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోమని నిర్మాతలతో చెప్పాడట. అంతే కాకుండా ఓజీ క్లైమాక్స్ లో అకిరా నందన్(Akira Nandan) ఎంట్రీ ఉంటుందని, సీక్వెల్ లో అతనిది ఫుల్ లెంగ్త్ రోల్ కూడా ఉంటుందని ఇది వరకే ఒక లీక్ వచ్చింది. ఈ సీక్వెల్ కి ప్రముఖ యంగ్ హీరో అడవి శేష్(Adavi Sesh) కూడా స్క్రిప్ట్ లో కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట. సీక్వెల్ స్క్రిప్ట్ వేరే లెవెల్ లో వచ్చిందని, కచ్చితంగా ఈ సీక్వెల్ బాహుబలి 2 , పుష్ప 2 తరహాలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ క్రీస్తే చేస్తుందని బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్.