Allu Arjun And Prashanth Neel: ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) ఫలితం అనుభవం తో ఇక నుండి తాను భారీ బడ్జెట్ కాంబినేషన్ సినిమాల జోలికి వెళ్లానని, నాకు ఇన్ని రోజులు అన్నం పెడుతూ వచ్చిన మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలను మాత్రమే నిర్మిస్తానని దిల్ రాజు(Dil Raju) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) సక్సెస్ మీట్స్ లో ఊదరగొట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. పోనిలే కనీసం ఇప్పటికైనా లైన్ లోకి వచ్చాడు దిల్ రాజు అని అందరూ అనుకున్నారు. కానీ ఒక్క హిట్ వచ్చిందో లేదో, దిల్ రాజు ఆశలకు రెక్కలు వచ్చాయి. గతంలో ప్రశాంత్ నీల్(Prashanth Neel) తో సినిమా చేయడానికి దిల్ రాజు ఒప్పందం కుదిరించుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్(Rebel star Prabhas) హీరో గా నటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) ని తీసుకొచ్చే పనిలో పడ్డాడట దిల్ రాజు.
Also Read: ఎట్టకేలకు ‘బాహుబలి 2 ‘ ని దాటేసిన ‘చావా’..’పుష్ప 2′ ని అందుకోవాలంటే ఇంకా ఎంత గ్రాస్ రావాలో తెలుసా!
రీసెంట్ గానే ప్రశాంత్ నీల్ ని కలిసిన దిల్ రాజు, గతంలో తనకి ఇచ్చిన మాట గురించి ప్రస్తావించాడట. ప్రభాస్ కాల్ షీట్స్ మూడేళ్ళ వరకు లాక్ అయిపోయాయి, గతంలో మనం ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నాం, కానీ అది కుదిరేలా లేదు, ప్రభాస్ కి బదులుగా ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో చేస్తే ఎలా ఉంటుంది అనే ప్రతిపాదన పెట్టాడట దిల్ రాజు. దానికి ప్రశాంత్ నీల్ కూడా సుముఖత చూపించినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చాలా రోజుల నుండే ఎదురు చూస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన ‘సలార్ 2’ కి షిఫ్ట్ అవ్వబోతున్నాడు.
ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఆయన DVV దానయ్య బ్యానర్ లో రామ్ చరణ్(Global Star Ram Charan) తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాడు. ఇలా మూడేళ్ళ వరకు ప్రశాంత్ నీల్ డేట్స్ కూడా ఫుల్. దీంతో ఈ ప్రాజెక్ట్ 2029 లో మాత్రమే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ తో ఒక సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయాలని అనుకున్నాడు కానీ, ఆ సినిమా స్క్రిప్ట్ ఇంకా సిద్ధం అవ్వకపోవడంతో ఒక ఆరు నెలలు సమయం ఇస్తే అట్లీ తో సినిమా చేసుకొని వస్తానంటూ త్రివిక్రమ్ కి చెప్పి, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నాడట అల్లు అర్జున్. ఇది ఆయన కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా పూర్తి అయ్యే సినిమాగా నిలవనుంది.