Nara Lokesh: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు( Pongal festivals ) ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా పల్లె లోగిల్లు సందడితో మారుమోగుతున్నాయి. సంక్రాంతికి నారావారిపల్లెలో సందడి చేసే చంద్రబాబు కుటుంబం.. ఈ సంవత్సరం అదే ఆనవాయితీని కొనసాగిస్తోంది. నారావారి పల్లెలో చంద్రబాబు కుటుంబంతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తన సతీమణి బ్రాహ్మణికి ఒక గిఫ్ట్ ఇచ్చారు. అయితే అది మంగళగిరి ప్రజల ఆనందానికి కారణమైంది. కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లె వెళ్ళిన లోకేష్ అక్కడ భార్య బ్రాహ్మణికి ఒక బహుమతి ఇచ్చారు. మంగళగిరి చేనేత చీరను అందించి ఆమెను ఆశ్చర్యపరిచారు.
* నారావారి పల్లెలో సందడి
ప్రస్తుతం నారాతోపాటు నందమూరి కుటుంబ సభ్యులంతా నారావారి పల్లెలోనే( Nara Vari Palle ) ఉన్నారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. స్థానికంగా ఉండే చిన్నారులతో కలిసిపోయాడు. వీధుల్లో ఆటలు కూడా ఆడుకుంటున్నాడు. మరోవైపు సంక్రాంతి సందర్భంగా వినూత్న పోటీలు నిర్వహించాడు. అందులో సైతం ఉత్సాహంగా పాల్గొన్నాడు దేవాన్ష్. మనవడిని చూసి చంద్రబాబు మురిసిపోయారు. ఇంకోవైపు సంక్రాంతి సంబరాలకు లోకేష్ కానుకగా ఇచ్చిన చీరతో కనిపించారు బ్రాహ్మణి. తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి చేనేత కార్మికులు తయారుచేసిన చీరను కట్టుకుని సందడి చేశారు.
* చేనేత శాల ఏర్పాటు
వాస్తవానికి మంగళగిరి( Mangalagiri) నియోజకవర్గంలో చేనేత కార్మికులు అధికం. ఈ ఎన్నికల్లో చేనేత కార్మికులు ఏకపక్షంగా లోకేష్ కు మద్దతు తెలిపారు. అందుకే 90 వేలకు పైగా మెజారిటీని సాధించారు లోకేష్. అందుకే గెలిచిన నాటి నుంచి మంగళగిరి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు నారా లోకేష్. వినతుల విభాగాన్ని ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావించారు. అందుకే మంగళగిరి నియోజకవర్గంలో చేనేత శాలను ఏర్పాటు చేశారు. మార్కెట్ తో పాటు రవాణా సదుపాయం కూడా కల్పించారు. చేనేత పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. పండుగ వేళ తన భార్యకు చేనేత చీరను అందించి.. మరోసారి మంగళగిరి నియోజకవర్గంలో అభిమానాన్ని చాటుకున్నారు.
* రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి లోకేష్( Nara Lokesh) . మంగళగిరి నియోజకవర్గ తనకు ఎప్పటికీ ప్రత్యేక మన్నారు. ఎక్కడ ఉన్నా మనసు మాత్రం మంగళగిరి పై ఉంటుందన్నారు. మంగళగిరిలో చేనేత రంగానికి తన వంతు సాయం అందిస్తానని చెప్పుకొచ్చారు.