https://oktelugu.com/

ICC Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీలో తలపడే ఆరు జట్ల ఆటగాళ్లు వీరే..

దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈసారి పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. 2017లో పాకిస్తాన్, భారత్ తలపడ్డాయి. ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమిపాలైంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 15, 2025 / 10:05 AM IST

    ICC Champions Trophy 2025

    Follow us on

    ICC Champions Trophy 2025: దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. క్రికెట్ అభిమానులను ఆకట్టుకునేందుకు ఐసీసీ ఈ టోర్నీ నిర్వహించనుంది. వన్డే ఫార్మాట్ విధానంలో ఈ టోర్నీ నిర్వహించనుంది. దీంతో ఈ టోర్నీ పై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ తొమ్మిదవ ఎడిషన్ జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ జరుగుతుంది.. పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ టోర్నీని ఐసీసీ నిర్వహించనుంది.. లాహోర్, రావల్సిండి, కరాచీ మైదానాలలో 8 జట్లు ఈ టోర్నీలో తలపడతాయి.. మొత్తం పది మ్యాచ్లు ఈ మైదానాలలో జరుగుతాయి.. దుబాయ్ వేదికగా భారత్ ఆడే మ్యాచ్ లను ఐసీసీ నిర్వహించనుంది. ఆటగాళ్లకు భద్రత కల్పించే విషయంలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని.. గతంలో ఇలాంటివి చాలా జరిగాయని భారత క్రికెట్ మేనేజ్మెంట్ ఐసీసీ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ భారత జట్టు ఆడే మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహించనుంది. గతంలో ఆసియా కప్ లోనూ భారత్ ఆడిన మ్యాచ్ లు దుబాయ్ వేదికగానే జరిగాయి.. ఈ టోర్నీ కోసం పాకిస్తాన్, భారత్ మినహా మిగతా దేశాలు మొత్తం తమ జట్ల వివరాలను వెల్లడించాయి. ఛాంపియన్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్ – ఏ లో ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు గ్రూప్ – బీ లో ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్టు తమ స్క్వాడ్ ను ప్రకటించాయి.

    ఆస్ట్రేలియా

    కమిన్స్(కెప్టెన్), నాదన్ ఎల్లిస్, ఆర్డి, క్యారీ, హేజిల్ వుడ్, హార్డీ, హెడ్, ఇంగ్లీస్, లబు షేన్, మార్ష్, మాక్స్ వెల్, షార్ట్, స్మిత్, స్టార్క్స్, ఆడం జంప.

    న్యూజిలాండ్

    శాంట్నర్(కెప్టెన్), బ్రేస్ వెల్, కాన్వే, చాప్ మన్, ఫెర్గు సన్, మిచెల్, హెన్రీ, లాతం, ఫిలిప్స్, ఓ రూర్క్, రచిన్ రవీంద్ర, నాథన్ స్మిత్, విల్ యంగ్, కేన్ విలియంసన్, సియర్స్.

    దక్షిణాఫ్రికా

    బవుమా(కెప్టెన్), మార్కో జాన్సన్, టోనీ డి జోర్జి. క్లాసెన్, కేశవ్ మహారాజ్, మార్క్రం, మిల్లర్, ఎంగిడి, ముల్డర్, రబాడ, రికెల్టన్, షమ్సీ, స్టబ్స్, డస్సెన్.

    బంగ్లాదేశ్

    శాంటో( కెప్టెన్), మెహిదీ హసన్ మిరాజ్, సౌమ్య సర్కార్, హసన్, తాంజిద్ హృదయ్, మహమ్మదుల్లా, జాకర్ అలీ, రిషాద్ హుస్సేన్, ముష్ఫీకర్ రహీం, ముస్తాఫిర్ రెహమాన్, తంజైమ్ హసన్, రాణా, నసూం అహ్మద్.

    ఇంగ్లాండ్

    జోస్ బట్లర్(కెప్టెన్), సాల్ట్, డకెట్, ఆర్చర్, అట్కిన్సన్, బెతెల్, బ్రూక్, కార్సే, స్మిత్, ఓవర్టన్, లివింగ్ స్టోన్, రషీద్, మహమ్మద్ మార్క్ ఉడ్.

    ఆఫ్ఘనిస్తాన్

    షాహిది (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, గుర్బాజ్, సెడి ఖుల్లా, రహమద్ షా, ఇక్రమ్, గుల్బాదిన్, ఒమర్జాయ్, నబీ, రషీద్ ఖాన్, ఏఎమ్ ఘజన్ పూర్, ఫూఖల్ అహ్మద్, మాలిక్, నవీన్ జద్రాన్.