Kodi Pandalu: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు( Pongal festivals ) ఘనంగా జరుగుతున్నాయి. పల్లె లోగిల్లు సందడితో కళకళలాడుతున్నాయి. ఇక గోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలో కోడిపందాల జోరు కొనసాగుతోంది. రాత్రికి రాత్రి కొందరు లక్షాధికారులు అవుతున్నారు. మరికొందరు కోడిపందాలు చూసి వినోదం పొందుతున్నారు. ప్రత్యేక కోడిపందాల బరులు జనాలతో కిటకిటలాడుతున్నాయి. శిబిరాల వద్ద ప్రత్యేక వసతులు, ఏర్పాట్లు చేశారు. ఫ్లడ్లైట్ల వెలుగుల మధ్య పందాలు కొనసాగుతున్నాయి. ఇంకోవైపు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు భారీగా బెట్టింగులకు దిగుతున్నారు.
* చాలా రకాల సెంటిమెంట్లు
అయితే కోడిపందాల( chicken bets ) విషయంలో కొంతమంది సెంటిమెంట్ ను పాటిస్తున్నారు. ముఖ్యంగా కుక్కటి శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అనేక ఆచారాలు, కట్టుబాట్లు, వ్యవహారాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా కుక్కటి శాస్త్రంలో భాగంగా నక్షత్ర బలం పైన బరిలో దిగిన కోళ్లు కచ్చితంగా గెలుస్తాయి అన్న నమ్మకం ఈ ప్రాంతంలో ఉంది. బరిలో దిగిన ముందుకు పిక్క బలంతో పాటు దాని యజమాని పేరు బలం కూడా ఉంటుందని చాలామంది నమ్మకం. అందుకే పందెం రాయుళ్లు వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
* పురాతనమైన శాస్త్రం
కుక్కుట శాస్త్రం( kukkuta sastram ) చాలా పురాతనమైనది. వారం, తిధి బట్టి అందుకు అనుగుణంగా రంగుల పుంజులను బరిలోకి దించుతారు. కుక్కుట శాస్త్రంలోని నియమాలను అనుసరించి తమ కోడిని బరిలో దింపితే తమకు ఓటమి అనేది అస్సలు ఉండదని పందెం రాయుళ్ల గట్టి నమ్మకం. నల్లని ఈకలు ఉండే పుంజును కాకి అని.. తెల్లని ఈకలుండే పుంజును సేతు అని అంటారు. మెడపై నలుపు, తెలుపు ఈకలు సమానంగా ఉంటే దాన్ని పర్ల అంటారు. ఇలా కుక్కుట శాస్త్రం ప్రకారం ఏ జాతి కోడిపుంజులు ఎక్కువగా గెలుస్తాయో తెలుసుకోవచ్చు. అందులోని నియమాల ప్రకారం బరిలో దింపే కోడికి కనీసం 6 నెలల ముందు నుంచే ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
* పందెం కోళ్లలో రకాలు
సాధారణంగా పందెం కోళ్లలో( chicken bets ) దాదాపు 50 రకాలు ఉంటాయి. వాటిలో అత్యంత ప్రధానమైనవి సీతవా, డేగ, నెమలి, కాకి, పర్లా, రసంగి, కౌజు… కోడి జాతిని బట్టి వాటి రంగులు కూడా మారతాయి. వీటిలో ఏ జాతి కోడిని ఇంకో జాతి పై ఉసిగొలిపితే.. ఏది కచ్చితంగా గెలుస్తుందని వివరాలు స్పష్టంగా వివరించబడ్డాయి. బెట్టింగ్ రాయులు ఈ శాస్త్రాన్ని అనుసరించే కోళ్లను బరిలో దింపుతూ ఉంటారు. కుక్కుట శాస్త్రం ప్రకారం మూడు రకాల పందేలు ఉంటాయి. అందులో మొదటిది కోడి కత్తి, రెండోది విడికాలు పందెం, మూడోది ముసుగు పందెం. మరోవైపు ఈ శాస్త్రం ప్రకారం ఏ రోజు ఏ దిశలో కోడిపుంజులను పందానికి వదలాలి అనే దానిపై స్పష్టమైన అంచనాలతో ఉంటారు. ముఖ్యంగా ఆది శుక్రవారం లో ఉత్తర దశలో,,, సోమ శనివారాల్లో దక్షిణ దిశలో.. బుధ, గురువారం పడమర దిశలో.. మంగళవారం తూర్పు దిశలో బరిలో దించుతారు.