Chandrababu Delhi Tour: చంద్రబాబు ఢిల్లీ టూర్ ధైర్యమిచ్చిందా?

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సాయం చేస్తుంటుంది. తప్పనిసరిగా రాష్ట్రాల వాటా నిధులు ఇవ్వాల్సిందే. కానీ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాధాన్యం చూసుకొని కేటాయింపులు చేస్తుంటాయి. తమ పార్టీ పాలిత రాష్ట్రాలకు నిధులు అధికంగా కేటాయిస్తుంటాయి.

Written By: Dharma, Updated On : July 5, 2024 10:42 am

Chandrababu Delhi Tour

Follow us on

Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు బాబు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులతో వరుసుగా సమావేశమయ్యారు. అయితే గతానికి భిన్నంగా.. ఎటువంటి అపాయింట్మెంట్ ఇబ్బందులు లేకుండా ప్రధానిని కలిసేందుకు చంద్రబాబుకు అనుమతులు లభించడం విశేషం. గతానికి భిన్నంగా చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలో చంద్రబాబు పాత్రను తెలియజేస్తోంది. మారిన రాజకీయ పరిస్థితులు స్పష్టంగా కనిపించాయి.

సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సాయం చేస్తుంటుంది. తప్పనిసరిగా రాష్ట్రాల వాటా నిధులు ఇవ్వాల్సిందే. కానీ కేంద్ర ప్రభుత్వం తమ ప్రాధాన్యం చూసుకొని కేటాయింపులు చేస్తుంటాయి. తమ పార్టీ పాలిత రాష్ట్రాలకు నిధులు అధికంగా కేటాయిస్తుంటాయి. అయితే ఈసారి కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. కానీ టిడిపి సపోర్ట్ కీలకంగా మారింది. అందుకే ఏపీలోని చంద్రబాబు సర్కార్ కు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రంపై ఏర్పడింది. ఇటు చంద్రబాబు సైతం గతానికి భిన్నంగా రాజకీయ ప్రయోజనాల కంటే.. రాష్ట్ర ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు. తద్వారా ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు.

కేంద్ర క్యాబినెట్లో తెలుగుదేశం పార్టీకి స్థానం దక్కింది. ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. ఇంకా చాలా రకాలుగా ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. కానీ వాటన్నింటికంటే నవ్యాంధ్రప్రదేశ్ కు నిధులు ముఖ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వ చేయూత అవసరం. అందుకే తాజాగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిశారు చంద్రబాబు. కీలక ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఉంచారు. వారు సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. ఇటు చంద్రబాబు వైఖరిలో మార్పు కనిపించింది. కేంద్ర పెద్దల తీరులో సైతం మార్పు స్పష్టమైంది. అదే చంద్రబాబులో ధైర్యానికి కారణమైంది. అవశేష ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇతోధికంగా సాయపడుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది. అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.