Fastest Indian Hatchback: హ్యచ్ బ్యాక్ లో వేగవంతమైన కారు ఇదే.. ఇండియా బుక్ ఆఫ్ రిరాక్డ్స్ లో చోటు..

Fastest Indian Hatchback: లేటేస్ట్ గా ఓ రేసింగ్ కారు 2 నిమిషాల్లో ల్యాప్ ను పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును నమోదు చేసుకుంది. ఇంతకీ ఆ కారు ఏదో చూద్దాం..

Written By: Srinivas, Updated On : July 5, 2024 10:46 am

Tata Altroz Racer

Follow us on

Fastest Indian Hatchback: కార్లు కొనాలని అనుకునే వారిలో విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కొందరు సింపుల్ గా కార్యాలయం, ఫ్యామిలీ అవసరాలకు మాత్రమే కార్లు కొంటారు. మరికొందరు మాత్రం హై ఫై రేంజ్ లో ఉండాలని కోరుకుంటారు. అయితే ఇంకోందరు మాత్రం రేసింగ్ మోడల్ కార్లను కోరకుంటారు. ఇలాంటి వేరియంట్లో వచ్చేవి కొన్ని మాత్రమే అయినప్పటికీ ఇవి ప్రత్యేకంగా నిలుస్తుంటాయి. లేటేస్ట్ గా ఓ రేసింగ్ కారు 2 నిమిషాల్లో ల్యాప్ ను పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును నమోదు చేసుకుంది. ఇంతకీ ఆ కారు ఏదో చూద్దాం..

టాటా కంపెనీ నుంచి బెస్ట్ మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ కంపెనీ నుంచి లేటేస్ట్ గా అల్ట్రోజ్ రేసర్ వేగవంతమైన రేసింగ్ కారుగా అవతరించింది. తమిళనాడులోని రేసింగ్ ట్రాక్ లో దీనిని పరీక్షించారు. కేవలం 2.21 నిమిషాల్లో ఈ మోడల్ ల్యాప్ ను పూర్తి చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న i20 ఇన్ లైన్, మారుతి సుజుకీ ఫ్రంట్ ను ఆల్ట్రోజ్ రేసర్ దాటేసింది. ఈ విషయాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ తన అధికారిక ఖాతా ‘X’ లో వివరించింది.

కోయంబత్తూరు ఆటో స్పోర్ట్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ రేస్ ట్రాక్ లో అల్ట్రోజ్ రేసర్ ను జూన్ 5న పరీక్షించినట్లు ఐబీఆర్ తెలిపింది. అయితే టాటా అల్ట్రోజ్ రేసర్ స్పోర్ట్స్ ఎడిషన్ ను ఆ తరువాత జూన్ 7న మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనిని రూ.9.49 లక్షల ధరకు నిర్ణయించారు. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మోడల్ అనేక విజయాలను సొంతం చేసుకుంది. హ్యాచ్ బ్యాక్ కారు అయినప్పటికీ 5 స్టార్ క్రాస్ రేటింగ్ పొంది స్పోర్టీ కారుగా నిలిచింది.

అలాగే ఇందులో ఎలక్ట్రిక్ సన్ రూప్, వైర్ లెస్ చార్జింగ్, వెంటిలేటేడ్ సీట్లతో అన్ని హంగులు కలిగిన మొదటి హ్యాచ్ బ్యాక్ గా నిలిచింది. అలాగే 360 డిగ్రీ కెమెరా కూడా ఇందులో ఉన్న మొదటి కారుగా నిలిచింది. అత్యంత వేగవంతమైన కారు కోసం చూసేవారికి ఇది బెస్ట్ కారు అని చాలా మంది కొనియాడుతున్నారు.