Sandeep Kishan
Sandeep Kishan : యంగ్ హీరోలలో మంచి యాక్టింగ్ టాలెంట్ ఉన్న నటుడు సందీప్ కిషన్(Sandeep Kishan). టాలెంట్ కి తగ్గ గుర్తింపు, క్రేజ్ రావడం లేదని ఆయన్ని అభిమానించే వాళ్ళు మొదటి నుండి బాధపడుతుంటారు. కానీ ఇప్పుడిప్పుడే సందీప్ కిషన్ సరైన లైన్ లోకి వచ్చాడు. గత ఏడాది ‘భైరవకోన’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సందీప్ కిషన్, ఈ ఏడాది ‘మజాకా'(Majaka Movie) సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి ట్రేడ్ లో మంచి బజ్ ఏర్పడింది. పాటలు హిట్ అవ్వడంతో పాటు, టీజర్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ తో ఉండడంతో కచ్చితంగా ఈసారి సందీప్ కిషన్ పెద్ద హిట్ కొట్టబోతున్నాడు అనే సంకేతాలు ప్రేక్షకుల్లో వెళ్లాయి. ఇదంతా పక్కన పెడితే మజాకా మూవీ షూటింగ్ ప్రొమోషన్స్ లో సందీప్ కిషన్, మూవీ టీం ఎంత బిజీ గా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం.
అందులో భాగంగా సందీప్ కిషన్ ఇచ్చిన ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘మా మజాకా మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతున్నప్పుడు చిరంజీవి(Megastar Chiranjeevi) గారి విశ్వంభర మూవీ(Vishwambhara Movie) షూటింగ్ కూడా పక్కనే జరుగుతుంది. చిరంజీవి గారిని కలవడానికి ఒకరోజు అక్కడికి వెళ్ళాను. ఏం సందీప్..విజయ్(Thalapathy Vijay) గారి కొడుకు దర్శకత్వం లో నటిస్తున్నావంటా?, అంతమంది తమిళ హీరోలు ఉన్నప్పటికీ, తెలుగోడి దగ్గరకి వచ్చాడంటే, నిన్ను చూసి గర్వపడుతున్నా అని నా భుజం తట్టి మాట్లాడాడు. ఆయన అన్న ఆ మాటలకు నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్. కొత్త వాళ్ళను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందు ఉంటాడనే విషయం మన అందరికీ తెలిసిందే. గతం లో సందీప్ కిషన్ ని కూడా అనేక సందర్భాల్లో ఆయన ప్రోత్సహించాడు.
ఇకపోతే మజాకా చిత్రం పై మూవీ టీం మొత్తం చాలా బలమైన నమ్మకంతో ఉంది. సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్ గా రావడం , అదే విధంగా రీసెంట్ గా విడుదలైన ‘సొమ్మసిల్లి పోతున్నావే’ అనే లిరికల్ వీడియో సాంగ్ పెద్ద హిట్ అవ్వడంతో ఆడియన్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దామా అనేంత ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. మంచి బజ్ క్రియేట్ అవ్వడం తో థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 11 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అదే విధంగా డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ కలిపి మరో 30 కోట్ల రూపాయిల లాభాలు నిర్మాతకు వచ్చాయి. రెగ్యులర్ గా హిట్స్ ఇవ్వకపోయినా కూడా సందీప్ కిషన్ సినిమాకి ఇంత మార్కెట్ జరగడం అనేది నిజంగా గమనించాల్సిన విషయమే. ఈ సినిమా హిట్ అయితే సందీప్ రేంజ్, మార్కెట్ బాగా పెరగొచ్చు.