AP Politics: ఏపీలో వైసీపీ స్థానంలో కాంగ్రెస్.. ఆ నేతలంతా సొంతగూటికి

వైసిపి ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీకి వెళ్లాల్సి వచ్చింది.

Written By: Dharma, Updated On : June 6, 2024 10:01 am

AP Politics

Follow us on

AP Politics: ఏపీలో వైసిపి కనుమరుగు కానుందా? కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేయనుందా? వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎన్డీఏ కు ఇండియా కూటమి గట్టిగానే పోటీ ఇచ్చింది. ఇటువంటి తరుణంలో ఎన్డీఏకు ఏపీ కీలకంగా మారింది. అందుకే కాంగ్రెస్ సైతం ఏపీలో బలపడాలని చూస్తోంది. ఏపీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తోంది. వైసీపీ నిర్వీర్యం చేసి.. ఆ స్థానంలో కాంగ్రెస్ రావాలని బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

వైసిపి ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. వారంతా తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీకి వెళ్లాల్సి వచ్చింది. అయితే 2014 ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉండిపోయిన నేతలు ఉన్నారు. బొత్స సత్యనారాయణ, పల్లం రాజు, హర్ష కుమార్, కెవిపి రామచంద్ర రావు, సుబ్బిరామిరెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కానీ 2014 ఎన్నికల్లో విజయనగరం లాంటి జిల్లాలో వైసిపి దారుణంగా ఓడిపోయింది. అప్పుడే బొత్స లాంటి నేతలకు జగన్ ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. వైసీపీలోకి వారు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఏపీలో బలపడాలనుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలకు ముందే వైసీపీలో కొనసాగుతున్న సీనియర్లకు సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. వైసీపీలో జగన్ చెప్పిందే వేదం అన్నట్టు పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అందుకే వారంతా కాంగ్రెస్ నాయకత్వం ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తూ వచ్చారు.

ఎంతటి దారుణ పరాజయంతో వైసిపి కోలుకోవడం కష్టమే.పైగా చంద్రబాబుకు రాష్ట్రంతో పాటు కేంద్రంలో సైతం అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇటువంటి సమయంలో వైసీపీలో ఉండడం కంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరడం ఉత్తమమని సీనియర్ నేతలు ఒక ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్ క్యాబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన వారు కేసుల్లో చిక్కుకోవడం ఖాయం. అందుకే ముందస్తుగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కొంతవరకు బయటపడవచ్చు అన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది. ఇంకోవైపు ఏపీలో కాంగ్రెస్ బలపడాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు తగ్గట్టుగా ఆయన పావులు కదుపుతారు. వైసీపీని నిర్వీర్యం చేయాలన్న ఆలోచనతో.. ఆ పార్టీలోని నేతలను కాంగ్రెస్ లోకి వెళ్లేలా తప్పకుండా పావులు కదుపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో వైసిపి దాదాపు కనుమరుగు అయినట్టే. వైసిపి ప్లేస్ లోకి కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయం.