https://oktelugu.com/

Telugu Directors: తెలుగులో ఈ యంగ్ డైరెక్టర్స్ ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్స్ గా మారబోతున్నారా..?

Telugu Directors: ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన తర్వాత ప్రాజెక్టులతో కూడా సూపర్ సక్సెస్ సాధించే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : June 6, 2024 / 10:09 AM IST

    Are these young directors in Telugu going to become star directors in the future

    Follow us on

    Telugu Directors: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక అందులో భాగంగానే ప్రశాంత్ వర్మ(Prasanth Varma) లాంటి దర్శకుడు స్టార్ డైరెక్టర్ గా మారడానికి రెడీ గా ఉన్నాడు. అయితే ఆయన హనుమాన్ సినిమాతో(Hanuman) సూపర్ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో తన విజయకేతనాన్ని ఎగరవేశాడు.

    ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన తర్వాత ప్రాజెక్టులతో కూడా సూపర్ సక్సెస్ సాధించే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఆయన ఇండస్ట్రీలో భారీ సక్సెస్ లను కొట్టాలని చూస్తున్నాడు…కాబట్టి తను ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయి ఇండస్ట్రీని ఏలే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…

    Also Read: Pawan Kalyan: చిరంజీవి కి జరిగిన అవమానానికి పవన్ కళ్యాణ్ రివెంజ్ తీర్చుకున్నారా..?

    ఇక కల్కి సినిమాతో(Kalki Movie) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నాగ్ అశ్విన్(Nag Ashwin) కూడా ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్ గా మారి ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు చేస్తాడు అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఆయన తీసిన మహానటి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ప్రభాస్ లాంటి స్టార్ హీరో తనకు డేట్స్ ఇవ్వడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక కల్కి సినిమాతోనే ఆయన స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతాడు. ఆయన ఇక మీదట చేసే సినిమాలతో కూడా మరింత హైప్ ని క్రియేట్ చేసుకొని భారీ సక్సెస్ లను అందుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఒక మొత్తానికైతే యంగ్ డైరెక్టర్లందరు స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలైతే చేస్తున్నారు…

    Also Read: Ram Charan: బుచ్చిబాబు సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న రామ్ చరణ్…

    ఇక సుకుమార్ ప్రియ శిష్యుడిగా మంచి పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు(Buchibabu) కూడా ఫ్యూచర్ లో స్టార్ డైరెక్టర్ అవుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు. ఇక ఇప్పటికే రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా సక్సెస్ సాధించే విధంగా తెరకెక్కించాలని తను చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాతో సక్సెస్ సాధించి ఆయన స్టార్ డైరెక్టర్స్ లిస్టులో చేరిపోతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…