Chebrolu Kiran: కూటమి ప్రభుత్వం( Alliance government ) వచ్చాక సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు నమోదయ్యాయి. అరెస్టుల పర్వం కూడా కొనసాగింది. నేతలు, వారి వ్యక్తిగత వ్యవహారాలపై కొందరు చేసిన కామెంట్స్ అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి. అయితే ఈ విషయంలో తమవారు, పరాయి వాళ్ళు అన్న తేడా లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి పని చేసిన ఐటీడీపీ కార్యకర్తపై కూడా వేటు వేసింది టిడిపి హై కమాండ్. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు కేసు నమోదు చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇది సంచలన అంశంగా మారింది.
Also Read: మంత్రితో ఆ వైసీపీ మాజీ మంత్రి రహస్య భేటీ.. నిజం ఎంత?
* సోషల్ మీడియా దుష్పరిణామాలు..
గత కొంతకాలంగా రాజకీయ పార్టీల నేతలు( political parties leaders), సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారు కొందరు. ఈ విషయంలో రాజకీయ పార్టీల మద్దతు దారులు దూకుడుగా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఇటువంటి సంస్కృతిని పెంచి పోషించారు. దీంతో కూటమి ప్రభుత్వం రాగానే దీనిపై ఉక్కు పాదం మోపడం ప్రారంభించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యేసరికి.. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రెచ్చిపోయిన కొందరు నేతలు, కార్యకర్తల అరెస్టు జరిగింది. అయితే టిడిపి మద్దతుదారులు అటువంటి పోస్టులు పెడితే చర్యలు తీసుకోవడం లేదని వైసిపి ఆరోపిస్తోంది. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత కామెంట్స్ చేసిన ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై చర్యలకు ఉపక్రమించింది తెలుగుదేశం పార్టీ నాయకత్వం.
* జగన్మోహన్ రెడ్డి పై అనుచిత కామెంట్స్…
ఉమ్మడి అనంతపురం( combined Ananthapuram district ) జిల్లా రాప్తాడులో ఇటీవల జరిగిన పరిణామాలు తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు హత్యకు గురయ్యారు. అదే సమయంలో మండల పరిషత్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను ఎస్సై బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో రాప్తాడు వెళ్లి బాధితులను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో తప్పులు చేసే పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు. దీనిపై ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన చేబ్రోలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇవి విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో టీడీపీ హై కమాండ్ స్పందించింది. చేబ్రోలు కిరణ్ పై వేటు వేసింది. తక్షణం కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది.
* ఆహ్వానించదగ్గ పరిణామం..
నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. తప్పు ఎవరు చేసినా తప్పే. ఈ విషయంలో తర,తమ అన్న బేధం ఉండకూడదు. ఇప్పుడు అదే అమలు చేసి టిడిపి మంచి ప్రయత్నాలను ప్రారంభించింది. గతంలో ఇటువంటి వ్యాఖ్యానాలకు బ్రేక్ వేసి ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్టు జరిగేదా? పోసాని కృష్ణ మురళికి ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు కదా? వల్లభనేని వంశీ మోహన్ కు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా? నిజంగా చేబ్రోలు కిరణ్ పై చర్యలకు ఉపక్రమిస్తే అది ఆహ్వానించదగ్గ పరిణామమే.