Pawan Kalyan : మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుందని పెద్దలు అంటుంటారు. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు. ఈ కర్మ సిద్ధాంతం కేవలం మనుషులకే కాదు, దేవుళ్ళకు కూడా వర్తిస్తుందని శ్రీకృష్ణడు భగవద్గీతలో చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) విషయం లో కూడా ఈ కర్మ సిద్ధాంతం చాలా బలంగా పని చేసింది. అందుకే ఆయన చిన్న కుమారుడు సింగపూర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డాడు. మార్క్ శంకర్(Mark Shankar) పక్కనే కూర్చున్న అమ్మాయి మంటల్లో చాలా వరకు కాలిపోయింది, అక్కడికక్కడే దురదృష్టం కొద్దీ చనిపోయింది ఆ చిన్నారి. అలాంటి పరిస్థితి లో కూడా ఆమె పక్కన కూర్చున్న మార్క్ శంకర్ కి చిన్న చిన్న గాయాలతో బయటపడడం అంటే అద్భుతం కాక మరేమిటి ఇది?, పవన్ కళ్యాణ్ చేసిన పుణ్య కారణాలే ఈరోజు బిడ్డ ప్రాణాలను కాపాడింది అనడానికి ఇంతకంటే మరో ఉదాహరణ ఉంటుందా?.
Also Read : పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు లేటెస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల..!
పవన్ కళ్యాణ్ ఇది వరకు ఎన్నో దానధర్మాలు చేశాడు, ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్య మంత్రి అయ్యాక కూడా ఆయన జేబులో నుండి వివిధ సందర్భాల్లో పది కోట్ల రూపాయిల వరకు సహాయ సహకారాలు అందించాడు. కొడుకు అగ్ని ప్రమాదానికి గురైన రోజున పవన్ కళ్యాణ్ మన్యం జిల్లా పర్యటన లో ఉన్నాడు. ఆరోజు కూడా ఆయన గ్రామం బాగు కోసం 5 లక్షల రూపాయిల విరాళం అందించాడు. గిరిజన సమాజానికి దేశవ్యాప్తంగా నేడు ప్రతిష్ట దక్కిండంటే అందుకు కారణం పవన్ కళ్యాణే. ఇలా ఒక్కటా రెండా, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసాడు కాబట్టే ఆ దేవుడు ఆయన కుటుంబానికి ఎలాంటి ఆపద లేకుండా కాపాడినాడు అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో అంటున్నారు. మరో ఆసక్తికరమైన విషయం మీరంతా గమనించాలి.
2019 ఎన్నికలలో ఘోర ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ఏడాది వరకు వైసీపీ పార్టీ కి పాలన పరంగా సహకరిద్దాం, ఎలాంటి పోరాటాలు చేయము అని చెప్పుకొచ్చాడు. కానీ ఆ పార్టీ అధికారం లోకి వచ్చిన ఆరు నెలలోపే భావన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. వాళ్ళను ఆ సమయంలో పట్టించుకున్న వాళ్ళు లేరు. అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వాళ్లకు అండగా నిలబడ్డాడు. వాళ్ళ తరుపున వైజాగ్ లో భారీ ర్యాలీ ని నిర్వహించాడు. ఇప్పుడే అదే భావన నిర్మాణ కార్మికులు పవన్ కళ్యాణ్ కొడుకుని కాపాడారు. వాళ్ళే కనుక ఆరోజు చొరవ తీసుకొని పిల్లలందరినీ కాపాడి ఉండకపోయుంటే, ఎంతటి ఘోరం జరిగేదో మీరే ఊహించుకోండి. ఇకపోతే మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నార్మల్ గానే ఉంది. నిన్న ఆయనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. మరో రెండు రోజుల పాటు ఆయన డాక్టర్ల పర్యవేక్షలోనే ఉండాల్సి ఉంటుందట.
Also Read : పవన్ కళ్యాణ్ లుక్ చేంజ్ చేయడం వెనక అసలు కారణం ఇదేనా..?