Trump Tariffs : ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ గత వారం రోజుల నుంచి పూర్తిగా కుదలేయ్యాయి. ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించిన టారిఫ్ ల యుద్ధం. స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేశాయి.అమెరికా దేశం కోణంలో చూస్తే ట్రంప్ చెప్పేదాంట్లో కొంత వాస్తవం ఉంది. అమెరికా అగ్రరాజ్యం పేరుతో ప్రతీదేశం వ్యాపారం కోణంలో ప్రతీ దేశం వాడుకుందన్నది ట్రంప్ వాదన.. పూర్తిగా దీన్ని కొట్టేయలేం..
ట్రంప్ టారిఫ్ ల వల్ల ఎప్పుడూ లేనంతగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అన్ని దేశాలతో పోల్చితే భారత్ పై పెద్దగా ప్రభావం పడలేదు. చైనా, వియాత్నం నష్టపోయే కొద్దీ ముందు ముందు భారత్ లాభపడుతుంది.
వ్యవస్థలు కుప్పకూలడంతో ట్రంప్ టారిఫ్ లపై విరామం ప్రకటించాడు. చైనా, కెనడా, మెక్సికోలను తప్పితే 70 దేశాలపై టారిఫ్ లను ఎత్తివేశాడు. 10 శాతం బేసిక్ టారిఫ్ అని ఒకటి వేశాడు.
అమెరికా స్టాక్ మార్కెట్ , బార్డ్ మార్కెట్ కుప్పకూలడంతో ట్రంప్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. లేదంటే ట్రంప్ వ్యూహాత్మకంగా ఈ ఝలక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ 90 రోజుల విరామంలో అమెరికాతో వ్యాపార ఒప్పందాలు చేసుకోబోతున్నాడు. కానీ చైనా విషయంలో మాత్రం రాజీ పడలేదు.
అతలాకుతలమైన స్టాక్ మార్కెట్లకు తిరిగి ట్రంప్ బూస్టర్ డోస్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.