Andhra Pradesh:ఇప్పటివరకు జాతీయ స్థాయిలో ఏపీకి మంచి పేరు ఉంది. సౌమ్యమైన రాష్ట్రంగా గుర్తింపు ఉంది. కానీ గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు అపఖ్యాతిని మూటగట్టుకునేలా ఉన్నాయి. ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత జరిగిన ఘటనలతో.. ఏపీ ఉత్తరాది రాష్ట్రాల జాబితాలో చేరిపోయింది. పాపం కరోనా సమయంలో మాస్కులు అడిగిన పాపానికి ఓ డాక్టర్ను ఎలా శిక్షించారో అందరికీ తెలిసిన విషయమే. తన అక్కను వేధిస్తున్నారని అడిగిన పాపానికి పదో తరగతి చదువుతున్న బాలుడిని యాసిడ్ చంపారు. తన కారు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు ఓ ప్రజా ప్రతినిధి. విపక్షాలు ఆరోపించినట్టు కాదు కానీ.. చాలా రకాల సాక్షాలు సామాన్య జనాలకు సైతం కనిపిస్తున్నాయి. అందుకే జగన్ సర్కార్ ఇంత ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంది. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ప్రజాభిమానాన్ని పొందలేకపోయింది.
పోలింగ్ నాడు, పోలింగ్ కు ముందు ఎన్ని రకాల విధ్వంసాలు జరగాలో.. అంతలా జరిగాయి. కౌంటింగ్ తర్వాత కూడా ఇది కొనసాగుతాయి అని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరించాయి. అందుకే సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మొహరించాయి.కోస్తా, గోదావరి జిల్లాలో అల్లర్లు జరుగుతాయని నిఘా సంస్థలు హెచ్చరించాయి. అదే సమయంలో పోలింగ్ నాడు వైసీపీ నేతల విధ్వంసకాండ కు సంబంధించి వీడియోలు బయటపడుతున్నాయి. ఎన్నెన్నో ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్ర హోం శాఖ.. ఏపీ పోలీస్ శాఖకు ప్రత్యేక లేఖ రాసి సంజాయిషీ అడగడం ఆందోళన కలిగిస్తోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ విజయవాడ వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పవన్ తో కలిసి విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. రెడ్ ఫ్లయింగ్ జోన్ గా ప్రధాని పర్యటన ఉంటుంది. కానీ ర్యాలీ ప్రారంభించడానికి ముందే ఆకాశంలో ఒక డ్రోన్ ఎగిరింది. అది ఏపీ పోలీస్ శాఖ పంపినదిగా తేలింది. వెంటనే ప్రధాని భద్రత సిబ్బంది దానిని నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ర్యాలీ సాగుతుండగానే మరో డ్రోన్ ఆకాశంలో తిరగడంతో భద్రత సిబ్బంది అలర్ట్ అయ్యారు. అది కూడా ఏపీ పోలీస్ శాఖ దేనిని తేలింది. అందుకే ప్రధాని పర్యటనలో డొల్లతనంపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ఏపీ పోలీస్ శాఖకు నోటీస్ జారీ చేసింది. మొత్తానికైతే ఈ వ్యవహారంతోనే వైసీపీ సర్కార్ తీరుపై జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. ఒకవైపు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం, మరోవైపు వైసీపీ నేతలు విధ్వంసకాండ వెలుగులోకి వస్తుండడంతో.. వైసీపీ అగ్రనేతలకు మింగుడు పడటం లేదు.