https://oktelugu.com/

Anand Mahindra: ప్రభాస్ బుజ్జికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ఏమన్నాడంటే?

తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా టాలీవుడ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 24, 2024 / 12:32 PM IST

    Anand Mahindra

    Follow us on

    Anand Mahindra: సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన సినిమా కల్కి. జూన్‌ 27న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో భారీ ప్రమోషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో డిఫరెంట్‌ లుక్‌‏లో స్టైలీష్‌గా ఉన్న బుజ్జిని చూసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో రూపొందించిన బుజ్జి కారుకు అద్భుతమైన ఫీచర్స్‌ ఉన్నాయి. దీంతో కల్కి ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ మూవీలో ఇంకెన్ని విభిన్న వాహనాలు ఉంటాయి ?.. అసలు సినిమా ఏ స్థాయిలో ఉండబోతుంది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుజ్జికి సంబంధించిన స్పెషల్‌ వీడియో నెట్టింట వైరలవుతుంది. బుజ్జి కారు స్పెషాలిటీస్‌ పరిచయం చేస్తూ ఉన్న వీడియో ఆకట్టుకుంటుంది.

    దర్శకుడిపై మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌పై ప్రశంసలు..
    తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా టాలీవుడ్‌ డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయనను చూస్తుంటే గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్‌(ట్విట్టర్‌) వేదికగా ఓ పోస్టు పెట్టారు. గతంలో నాగ్‌ అశ్విన్‌ పెట్టిన ట్వీట్‌ స్క్రీన్‌షాట్‌ను షేర్‌ చేస్తూ.. ‘నిజానికి సరదా సంగతులు ఎక్స్‌లో కనిపిస్తాయి. నాగ్‌ అశ్విన్‌.. అతడి టీమ్‌ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వాహనాలు తయారు చేయడంలో కల్కి చిత్రయూనిట్‌కు చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ టీమ్‌ సహయపడుతుంది. బుజ్జి వాహనం రెండు మహీంద్రా ఈ మోటార్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్‌ కూడా ఈ వాహనం రూపొందిచండంలో భబాగమైంది’ అని వివరించారు. ఈ ట్రీవ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    స్పందించిన డైరెక్టర్‌..
    ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా స్పందించారు. ‘అసాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారు. ధన్యవాదాలు’ అంటూ రిప్లయ్‌ ఇచ్చారు. దీనికి ఆనంద్‌ మహీంద్రా ‘కలలు కనడం మానొద్దు..’ అని రీట్వీట్‌ చేశారు. వీరిద్దరి ట్వీట్‌లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కల్కి సినిమా జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నారు.