Bobbili Thief: న్యూస్ పేపర్ చదువుతుంటే.. న్యూస్ ఛానల్ చూస్తుంటే ఏదో ఒకచోట నేర వార్త కనిపిస్తుంది. సహజంగా పాఠకులలో ఎక్కువ శాతం నేర వార్తలను చదువుతుంటారు. ఎందుకంటే నేర వార్తల్లో రియాలిటీ ఎక్కువగా కనిపిస్తుంది.. పైగా సమాజంలో జరుగుతున్న పెడపోకడలు నేరవర్తలు స్పష్టంగా దర్శనమిస్తాయి. అందువల్లే నేరవార్తలకు ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది.. అయితే నేరాలకు పాల్పడే వ్యక్తులు భిన్నంగా ఉంటారు. వారి వైఖరి కూడా మిగతావారితో పోల్చి చూస్తే విచిత్రంగా ఉంటుంది. అందువల్లే నేరాలు చేసిన వారిలో ఎక్కువ శాతం మంది ఎక్కడో ఒకచోట దొరికిపోతుంటారు. ఇప్పుడు మీరు చదవబోయే కథనంలో కూడా దొంగ అటువంటి వాడే. అతడికి యుక్త వయసులోనే దొంగతనం అలవాటయింది. అదే సమయంలో లేనిపోని వ్యసనాలను ఒంట పట్టించుకున్నాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.
Also Read: ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో మూడు నెలలకు ఒకసారి చెల్లింపులు!
అతడు ఓ దొంగ. యుక్తవయసు నుంచే అతడికి చోర కళ అలవడింది. ఇంకేముంది తన హస్త లాఘవాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. దొంగతనాలు చేసి మద్యం తాగేవాడు. విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. ఖరీదైన దుస్తులు ధరించేవాడు. హై ఫై లైఫ్ అనుభవించేవాడు. సాధారణంగా ఒకచోట దొంగతనం చేసిన తర్వాత.. క్షణాలలోనే ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయేవాడు. ఆ తర్వాత వేరే చోటకు వెళ్లి దొంగలించిన సొత్తును విక్రయించేవాడు. అలా వచ్చిన డబ్బుతో కొంత నగదు తన ఖాతాలో ఉంచుకునేవాడు. మిగతా నగదుతో మద్యం, విందు వినోదాలు చేసుకునేవాడు. అయితే మద్యం తాగేటప్పుడు.. విందు వినోదాలకు పాల్పడేటప్పుడు ఎవరిని కూడా తన వెంట తీసుకెళ్లేవాడు కాదు. చివరికి దొంగతనంలోనూ ఒక్కడే పాలుపంచుకునేవాడు. తాళం వేసిన ఇళ్లను చూడటం.. రెక్కీ నిర్వహించడం.. ఆ తర్వాత దొంగతనం చేయడం.. ఇలా ఉంటుంది ఆ వ్యక్తి క్రైమ్ స్టయిల్. అందువల్లే ఇన్ని రోజులపాటు అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. అయితే చివరికి అతడి పాపం పండింది. అతడు చేసిన దొంగతనం బయటపడింది. ఫలితంగా పోలీసులకు దొరికిపోయాడు.
Also Read: ఆ వైసీపీ కీలక నేతకు అండగా కూటమి ఎంపీలు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోని బొబ్బిలిలో సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు ముఠామేస్త్రిగా పనిచేస్తుంటాడు. వ్యవసాయ పనుల నిమిత్తం కుటుంబంతో కలిసి అలజంగి అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఈ క్రమంలో తన ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసిన విషయాన్ని తెలుసుకున్న దొంగ.. అతని ఇంట్లోకి ప్రవేశించాడు. తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. అతని ఇంట్లో ఉన్న వెండి, ఇతడి సామాగ్రిని విక్రయించడం మొదలుపెట్టాడు. వాటిని అమ్ముకోగా వచ్చిన డబ్బుతో మద్యం తాగి.. శ్రీనివాసరావు ఇంట్లోనే నిద్రపోవడం ప్రారంభించాడు. శ్రీనివాసరావు ఇంటికి అతడు దొంగచాటుగా వస్తున్న విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు శ్రీనివాసరావు ఇంటికి చేరుకోగా ఆ దొంగ మద్యం మత్తులో పడుకున్నాడు. దీంతో పోలీసులు లోపలికి ప్రవేశించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం ఆ దొంగ దాదాపు లక్ష రూపాయల విలువైన సామాగ్రి విక్రయించినట్లు తెలుస్తోంది. వెండి, ఇత్తడి సామాగ్రిని అమ్మి.. వచ్చిన డబ్బుతో మద్యం తాగినట్టు తెలుస్తోంది. అయితే బొబ్బిలి ప్రాంతంలోనే ఓ స్టీల్ సామాన్ కొనుగోలు చేసే వ్యక్తికి ఇంటి సామాగ్రి మొత్తం విక్రయించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మద్యం మత్తులో చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోయిన దొంగ
బొబ్బిలిలో సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి వ్యవసాయ పనుల కోసం అలజంగికి వెళ్లగా, ఓ దొంగ ఆయన ఇంటి తాళం పగులగొట్టి చొరబడ్డాడు. మూడు రోజులుగా వెండి, ఇత్తడి సామాన్లను చోరీ చేసి, వాటిని అమ్ముకుని మద్యం తాగి ఆ ఇంట్లోనే నిద్రపోతున్నాడు.… pic.twitter.com/rmHUm96Fzv
— ChotaNews App (@ChotaNewsApp) July 2, 2025